Maoist Radha: `విరాట పర్వం` సీన్ రిపీట్.. కోవర్టుగా భావించి మహిళా మావోయిస్టు హత్య
Maoists Kill Woman Cadre Alleges Her As Police Informer: పార్టీ రహాస్యాలు పోలీసులకు అందిస్తుందనే నెపంతో తోటి నాయకురాలిని మావోయిస్టులు హతమార్చారు. మరో వెన్నెల కథగా కనిపించే యథార్థ సంఘటన ఇది.
Maoist Kill Radha: ఇన్‌ఫార్మర్ నెపంతో అమాయకురాలిని బలిగొన్న కథతో తీసిన 'విరాటపర్వం' సినిమా చూసే ఉంటారు. అచ్చం అలాంటి సంఘటనే మళ్లీ తెలంగాణలో చోటుచేసుకుంది. దశాబ్దాల అనంతరం మరోసారి కోవర్టుగా భావించి ఓ మహిళా మావోయిస్టును తోటి నక్సల్స్ హతమార్చారు. ఈ విషయాన్ని మావోయిస్టు సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పత్రిక ప్రకటనను విడుదల చేసింది. మరో సరళగా రాధను గుర్తుచేసుకుంటున్నారు.
Also Read: Atchutapuram SEZ: ఏపీలో మరో ఘోరం.. రియాక్టర్ పేలి ఏడుగురు దుర్మరణం
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోనిని బాలాజీనగర్ అంబేడ్కర్ నగర్ (న్యూ ఇందిరానగర్)కు చెందిన బంటి బాలయ్య, బాలమ్మల కుమారై రాధ. ఇంటర్, డీఎమ్ఎల్టీ పూర్తిచేసింది. ఉద్యమం పట్ల ఆకర్షితురలై 2018లో అన్నల్లో కలిసింది. విప్లవ రాజకీయాలను విశ్వసించి రాధ స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది. రాధ కాస్త నీల్ఫోగా పేరు మార్చుకుంది. పార్టీలో చేరిన ఆరు ఏళ్లల్లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో విప్లవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. పార్టీ సభ్యురాలిగా.. జోన్ మిలటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా.. నాయకత్వ రక్షణాదళం కమాండర్‌గా రాధ బాధ్యతలు నిర్వర్తించింది.
Also Read: Bengaluru Ambulance: ఫ్లైఓవర్‌పై అంబులెన్స్ బీభత్సం.. అచ్చం సినిమాలో చూసినట్టే దృశ్యాలు
అంచలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదుగుతున్న రాధలో వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణారాహిత్యం ఏర్పడిందని పార్టీ గుర్తించింది. ఈ క్రమంలోనే మూడు నెలల కిందట ఆమెను కమాండర్ బాధ్యతల నుంచి పార్టీ తొలగించింది. నీల్పోను ఉద్యమం నుంచి బయటకు తీసుకురావడానికి పోలీసులు ఒత్తిడి చేశారని.. రాధ తమ్ముడు సూర్యంకు ఉద్యోగం, డబ్బులు, విలాసవంతమైన జీవితం ఆశలు చూపించి లొంగదీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దీంతో అతడు పోలీసులకు ఏజెంటుగా మారాడని ప్రకటనలో తెలిపారు.
అప్పటి నుంచి పోలీసు ఇంటలిజెన్సీ విభాగంలో పనిచేస్తూ నిరుద్యోగ, లంపెన్ యువతను చేరదీసి.. వారిలో ప్రీతి, రాజు, సురేశ్‌తో కలిపి ఒక బృందం ఏర్పడిందని మావోయిస్టు పార్టీ తెలిపింది. వారి ద్వారా ఎప్పటికప్పుడు తమపై నిఘా ఉంచారని ఆరోపించింది. కొన్ని నెలల కిందట రాధ ఫోన్ నంబర్ సంపాదించి ఆమె స్నేహితులు, సోదరుడు సూర్యం ద్వారా లొంగదీసుకున్నారని వివరించింది. తమ్ముడు కుటుంబ దుస్థితి.. పార్టీ రహాస్యాలు చెబితే భారీగా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి రాధను లొంగదీసుకున్నారని వెల్లడించింది.
తమ్ముడి మాటలకు ప్రభావితమైన రాధ పోలీసు ఇంటలిజెన్సీ అధికారులకు సహకరిస్తూ పార్టీ కీలక సమాచారాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. కొందరు కోవర్టులతో కలిసి రహాస్యాలను పోలీసులకు చేరవేస్తున్న రాధను హతమార్చినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటనలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో వెన్నెల పరిస్థితి అయ్యిందని చర్చించుకుంటున్నారు. విరాటపర్వం సినిమాలో కూడా ఇదే మాదిరి జరిగింది. అప్పుడు వెన్నెల.. ఇప్పుడు రాధ అని చర్చ జరుగుతోంది. కాగా రాధ హత్య విషయమై పోలీసులు ఇంకా స్పందించలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook