Nizamabad News: మటన్ బొక్క ఎఫెక్ట్‌తో పెళ్లి క్యాన్సిల్.. నిజజీవితంలో బలగం సీన్ రిపీట్
Balagam: బలగం సినిమాలో నల్లి బొక్క వెయ్యలేదన్న కారణంతో ఎంత పెద్ద రచ్చవుతుందో మనమంతా చూసిన సంగతే. దాదాపు ఆ సినిమా కథ మొత్తం ఆ సీన్ వల్లనే మారిపోతుంది.. అయితే ఇప్పుడు అదే సంఘటన నిజ జీవితంలో కూడా జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Marriage Cancel Due To Mutton: సినిమాల్లో జరిగేవి మన నిజ జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని సీన్లు సినిమాలో చూసి ఇవి నిజంగా జరుగుతాయా అని అనుమానం మనకు కలగవచ్చు.. ఆనంద్ సినిమాలో చీర కోసం హీరోయిన్ పెళ్లి ఆపుకుంటుంది.. అయితే అప్పట్లో అసలు ఇలా ఎవరన్నా చేస్తారా అని ఎంతోమంది అనుకున్నారు. కానీ దాని వెనక ఎంత అర్థం ఉండి అని కొంతమందికే అర్థమవుతుంది. కాగా ఆ తర్వాత నిజజీవితంలో కూడా చీర కోసం ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి.
ఇక ఈ మధ్య మనల్ని అంతగా ఆశ్చర్యపరిచిన సన్నివేశం బలగం సినిమాలో నల్లి బొక్క సన్నివేశం.
నల్లి బొక్క చుట్టూ తిరిగిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు నిజజీవితంలో కూడా ఇలాంటి ఒక సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో మటన్ బొక్క కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయింది. అవును మీరు విన్నది నిజమే.. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ కు చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. నవంబర్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ వేడుకలో అమ్మాయి ఇంట్లో మటన్ తో భోజనం ఏర్పాటు చేశారు. అబ్బాయి బంధువులు నల్లి బొక్క కావాలని కోరడంతో గొడవ జరిగింది. అసలు విషయానికి వస్తే యువతి ఇంట్లో నిశ్చితార్థం సందర్భంగా వరుడి తరఫున బంధువు మూలుగు బొక్క వడ్డించమని కోరగా వేయలేదట. దీంతో అది అవమానంగా భావించిన వరుడి తరఫు బంధువులు అమ్మాయి కుటుంబ సభ్యులతో వాగ్వా దానికి దిగారు. విషయం కాస్తా పెద్దది కావడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం. చివరికి పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.
నవంబర్ నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Ind vs SA Test Series: సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్, ఇద్దరు మినహా సీనియర్ల టీమ్ రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook