నగ్న వీడియోలతో బెదిరింపులు.. వివాహిత ఆత్మహత్య
యువకుడి లైంగిక వేధింపులు (Sexual Harassment ) భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యువకుడిని మందలించాల్సిన తల్లిదండ్రులే అతడిని ప్రోత్సహించడం అమానుషం.
యువకుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యువకుడిని మందలించాల్సిన తల్లిదండ్రులే అతడిని ప్రోత్సహించడం అమానుషం. ఈ దారుణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఆ దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి సంతానం ఇద్దరు పిల్లలు. పాల్వంచ పట్టణంలోని ఓ తండాలో నివాసం ఉంటున్నారు. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
ఈ క్రమంలో వివాహిత(43)పై స్థానికంగా ఉండే బానోతు మధు(21) కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా ఏడాది కిందట ప్లాన్ ప్రకారం తన సెల్ ఫోన్లో వీడియో తీశాడు. వీడియోలు చూపి లోబరుచుకోవాలని చూడగా స్థానిక పెద్దలకు ఫిర్యాదు చేసింది. పంచాయితీ పెట్టిన పెద్ద మనుషులు మధును మందలించి వదిలేశారు. కొంతకాలం వరకు బాగానే ఉన్నా, ఇటీవల వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే నీ భర్తను చంపేస్తానని బెదిరించి వివాహితను లోబరుచుకున్నాడు. Photos: రానా, మిహికా రోకా వేడుక.. ఫొటో గ్యాలరీ
ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఇది మంచి పద్థతి కాదని వివాహిత వేడుకుంది. కానీ తనతో శారీరక సంబంధం కొనసాగించకపోతే ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు మధు. విషయాన్ని భర్తకు చెప్పి పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మధు, తన తల్లిదండ్రులతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు బాధితురాలిని అసభ్య పదజాలంతో దూషించారు.
తమ కొడుకుపైన కేసు ఎందుకు పెట్టావంటూ ప్రశ్నించారు. తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు మధు కోసం గాలిస్తున్నామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్