Medaram Jatara Buses: హైదరాబాద్‌లో చాలా మంది ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించే వారిలో చాలా మంది టీ 24 టికెట్‌ను తీసుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. హైదరాబాద్‌లో 100 రూపాయలతో ఈ టీ 24 టికెట్ తీసుకుంటే సిటీ అంతటా ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించొచ్చు. దీన్నే డైలీ పాస్ అని కూడా అంటుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే టీ 24 టికెట్ తీసుకున్న వారు హైదరాబాద్‌లోని పలు సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ఎన్ని సార్లు అయినా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ టీ 24 టికెట్స్‌ అన్ని బస్సులలో కండక్టర్ల దగ్గర అందుబాటులో ఉంటాయి. 


అయితే ఇప్పుడు సేమ్ ఇదే టీ 24 టికెట్‌ సౌకర్యాన్ని మేడారం జాతర సందర్భంగా మరో మూడు సిటీల్లో అమల్లోకి తెచ్చింది టీఎస్‌ ఆర్టీసీ. వరంగల్, కాజీపేట, హన్మకొండ వాసుల కోసం ఇప్పుడు టీ 24 టికెట్‌ను టీఎస్‌ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా వరంగల్, కాజీపేట, హన్మకొండ నగరాల్లో టీ 24 టికెట్‌ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 


టీ 24 టికెట్‌ తీసుకుని ఈ మూడు నగరాల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్టీనరీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించొచ్చు. మేడారం జాతర సందర్భంగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది టీఎస్‌ఆర్టీసీ. ఇక నిన్నటి నుంచే వరంగల్, కాజీపేట, హన్మకొండలలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.


టీ 24 టికెట్ ద్వారా ఈ మూడు సిటీలలో రోజంతా ట్రావెల్ చేయవచ్చు. ఏ రూట్‌లో అయినా సరే.. ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చు. మేడారం జాతర సందర్భంగా ప్రయాణికులు టీ 24 టికెట్ చాలా ఉపయోగపడనుంది. 


ఇక మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు కూడా టీఎస్‌ ఆర్టీసీ 3845 స్పెషల్ బస్సుల్ని (Buses) ఏర్పాటు చేసింది. 51 పాయింట్స్ ద్వారా మేడారానికి బస్సుల్ని నడపనున్నారు. వరంగల్ జిల్లాలో 30 బస్‌ పాయింట్స్ నుంచి మేడారానికి బస్సులు నడవనున్నాయి. అలాగే మేడారంలో (Medaram) భక్తుల్ని జంపన్న వాగుకు తరలించేందుకు ఫస్ట్ టైమ్‌ మినీ బస్సుల సౌకర్యాన్ని కూడా కల్పించారు.


Also Read: Hijab controversy: హిజాబ్ వివాదం భయాలు- మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్​!


Also Read: POCO M4 Pro 5G: పొకొ నుంచి మరో బడ్జెట్ 5జీ ఫోన్​- ధర, ఫీచర్లు ఇవే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook