Bus Ticket for Cock: ఆర్టీసీ బస్సులో కోడి పుంజుకు టికెట్.. పరిశీలిస్తానన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Conductor Gives a ticket to Cock: ప్రాణంతో ఉండే ప్రతి జీవికి టికెట్ మస్ట్‌ అంటున్నాడు ఒక ఆర్టీసీ కండక్టర్‌‌.. కోడి అయినా మరే ఏ జీవి అయినా సరే టికెట్ కచ్చితంగా తీసుకోవాలంటున్నాడు.. మరి ఆ స్టోరీ ఏమిటో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 12:02 AM IST
  • కోడిపుంజుకు టికెట్
  • ఆర్టీసీ బస్సులో కండక్టర్ నిర్వాకం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఘటన
  • ప్రాణమున్న జీవికి టికెట్ తీసుకోవాల్సిందనన్న కండక్టర్
Bus Ticket for Cock: ఆర్టీసీ బస్సులో కోడి పుంజుకు టికెట్.. పరిశీలిస్తానన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Ticket to Kodipunju in RTC Bus: కోడిపుంజుకు ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ కొట్టాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ప్రయాణికుడు తనతో పాటు కోడిపుంజును కూడా వెంటబెట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కగా.. కండెక్టర్‌‌ ఆ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టేశాడు. ఇదేమిటని అడిగితే.. ప్రాణమున్న జీవికి టికెట్ తీసుకోవాల్సిందే అని కండక్టర్ చెప్పుకొచ్చాడు. 

మామూలుగా ఆర్టీసీ బస్సులో కొంత వరకు లగేజీకి, అలాగే చిన్న పిల్లలకు టికెట్ లేకుండా మినహాయింపు ఇస్తుంటారు. ఏజ్‌ను బట్టి హాఫ్ టికెట్ కొడుతుంటారు. అయితే కోడిపుంజుకు టికెట్ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆ కోడి పుంజుకు కండక్టర్‌‌ 30 రూపాయల టికెట్ కొట్టాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గోదావరి ఖని నుండి కరీంనగర్‌‌కు బయల్దేరింది. ఆ బస్సులో మహమ్మద్ అలీ అనే ప్యాసింజర్‌‌ కూడా ఎక్కాడు. ఆయన గోదావరి ఖని నుంచి కరీంనగర్‌ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. అయితే ఆయనతో పాటు సంచిలో ఒక కోడిపుంజు ఉంది. కోడిపుంజును చూసిన కండక్టర్‌‌ దానికి కూడా టికెట్ తీసుకోవాలన్నాడు. అదేంటీ అని ఆ ప్రయాణికుడు అడగ్గా.. ప్రాణం ఉన్న జీవిని వెంట తీసుకెళ్లాలంటే టికెట్ కంపల్సరీ అని కండక్టర్ సమాధానం ఇచ్చాడు. అలా కండక్టర్ ఆ కోడిపుంజుకు రూ.30 బస్సు టికెట్ కొట్టాడు. దీంతో మహమ్మద్‌తో పాటు బసులోని ప్రయాణికులంతా షాక్ అయ్యారు.

ఇక ఈ విషయంపై ఓ ప్రయాణికుడు టికెట్‌ను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌కు ట్యాగ్‌ చేశారు. ఆర్టీసీలో ఇలాంటి రూల్ ఉందా అని ఆ ప్రయాణికుడు అడిగారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్... (Sajjanar) ఈ విషయాన్ని పరిశీలిస్తామని బదులిచ్చారు. 

కాగా ఆర్టీసీ (RTC) బస్సులో ఒక నిర్ణీత బరువు దాటి ఉండే లగేజ్‌కు మాత్రమే టికెట్ కొడతారు. కానీ గోదావరి ఖని కండక్టర్ కోడి పుంజుకు కూడా టికెట్ కొట్టడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Also Read: AP Corona Update: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా..

Also Read: Romeo Juliet Full Song: వాలెంటైన్స్ కోసం మరో కొత్త పాట.. రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News