Medaram Jatara: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటి (ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభమైంది. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రారంభమయ్యే ఈ జాత శనివారం వరకు (ఫిబ్రవరి 19) వరకు కొనసాగుతుంది. ఈ జాతరకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు విచ్చేయనున్నారని అధికారుల అంచనా. అందుకు కోసం ములుగు జిల్లాలోని మేడారంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం (ఫిబ్రవరి 18)న ముఖ్యమంత్రి కేసీఆర్.. సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. అందుకు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి జాతర ఏర్పాట్లను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు కొందరు మంత్రులు అక్కడే ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన ఈ మేడారం జాతరను 1940 నుంచి ఘనంగా జరుపుతున్నారు. 1996లో ఈ జాతరకు రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించి.. అప్పటి ప్రభుత్వం అనేక ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత సమ్మక్క, సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి మేడారంకు హెలికాప్టర్ సేవలను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. 


కరోనా నిబంధనలను పాటిస్తూ..


కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని.. ప్రజలకు మాస్క్ లు, శానిటైజర్లను ప్రభుత్వం ఈ జాతరలో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు అత్యవసర వైద్యానికి ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. భక్తులకు అందజేసే మంచి నీరు, ఆహారం పట్ల అధికారులు ఎప్పటికప్పుడూ జాగ్రత్త వహించనున్నారు. 


భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు


గోదావరి ఉపనది అయిన జంపన్న వాగులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి.. ఆ తర్వాత సమ్మక్క, సారలమ్మ పూజల్లో పాల్గొంటారు. జాతర జరిగే ప్రదేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూ. 75 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రహదారి విస్తరణ నుంచి ప్రత్యేక బస్సులను కేటాయించడం వరకు అధికారులు అన్నీ ఏర్పాట్లను చేశారు. 


అదే విధంగా జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వాడరాదని విజ్ఞప్తి చేశారు. జాతరలో ప్లాస్టిక్ నిషేధాన్ని విధించారు. ఎన్నో మరుగుదొడ్లను నిర్మించారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పవిత్ర స్నానం చేసేందుకు జాతర ప్రదేశం నుంచి ఉచిత బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. అందుకు కోసం 25 మినీ బస్సులను నాన్ స్టాప్ గా నడిచే విధంగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. 


జాతరలో భారీ భద్రత


వాహనాల పార్కింగ్ కోసం దాదాపు 11 వందల ఎకరాలను కేటాయించారు. పెద్ద బస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశారు. జాతరలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరలో భారీ బందోబస్తును కల్పించనున్నారు. 11 వేల మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. జాతర ప్రాంగణం నుంచి అర కిలోమీటరుకు ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. వాటన్నిటిని ప్రభుత్వం కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. భక్తుల కదలికపై అధికారులు ఓ కన్నేసి ఉంచారు.  


Also Read: Medaram Jatara 2022: మేడారం జాతరకు కేంద్రం నిధులు... కిషన్ రెడ్డి కీలక ప్రకటన


Also Read: Medaram Jatara: మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లొద్దామా..! పూర్తి వివరాలివిగో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook