Sammakka Sarakka Jatara 2022: మేడారం జాతరకు తెలంగాణ సర్కార్‌‌ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడపనుంది. ఇక ఈ ఏడాది కొత్తగా మరో విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka Sarakka) వార్ల ప్రసాదాన్ని నేరుగా ఇంటికే పంపించే సదుపాయాన్ని తీసుకొచ్చారు.
ఈ సారి మేడారం ప్రసాదాన్ని డోర్‌ డెలీవరీ చేయనున్నట్లుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి (Indrakaran Reddy) స్పష్టం చేశారు. 


ఆర్టీసీతో పాటు పోస్టాఫీస్‌ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఈ డోర్ డెలివరీ (Door Delivery) కార్యక్రమం నిర్వహించునున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఫిబ్రవరి 12 నుంచి 22వ తేదీ వరకు మేడారం జాతర ప్రసాదరం ఆన్‌లైన్‌లో ఇంటికే పంపనున్నట్లు చెప్పారు. 


ఈ డోర్‌‌ డెలివరీ సేవలను భక్తులు వినియోగించుకోవాలంటూ మంత్రి కోరారు. అలాగే భక్తులు ఇంటి దగ్గర నుండే అమ్మవార్లకు బంగారం (బెల్లం) పంపేందుకు కూడా టీఎస్‌ ఆర్టీసీ ద్వారా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీసీ (RTC) సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి అమ్మవారికి సమర్పించాల్సిన బంగారం (బెల్లం) తీసుకెళ్తారు. 


ఇక బంగారం అమ్మవారికి సమర్పించి.. తిరిగి ప్రసాదం కూడా అందజేస్తారు. మేడారానికి (Medaram) వెళ్లి మొక్కు చెల్లించుకోలేని భక్తులకు టీఎస్ ఆర్టీసీ (TS RTC) కార్గో ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవా, టీయాప్‌ ఫోలియోలలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. 


Also Read: Inter Exams 2022: ఏప్రిల్​ 20 నుంచి ఇంటర్ పరీక్షలు- పూర్తి షెడ్యూల్ ఇదే..


Also Read: Telangana Covid-19 Update: తెలంగాణలో 24 వేలు యాక్టివ్‌ కేసులు...కొత్త కేసులు ఎన్నంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook