Meerpet Murder Case Scene Reconstruction: తెలంగాణలో సంచలనం రేకెత్తించిన మీర్‌పేట మర్డర్ కేసును పోలీసులు చేధించారు. భర్త గురుమూర్తే హంతకుడని తేల్చి అరెస్ట్ చేశారు. గురుమూర్తి నివాసంలో దొరికిన ఆనవాళ్లను డీఎన్ఏ టెస్టుకు పంపించారు. డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా గురుమూర్తిని అరెస్ట్ చేశారు. భార్య మాధవి అతి కిరాతకంగా చంపేశాడు గురుమూర్తి. డెడ్ బాడీని ముక్కలుగా నరికి.. కుక్కర్ లో ఉడికించాడు. తర్వాత ఎండబెడ్డి శరీరభాగాలను పొడిగా చేసి చెరువులో కలిపాడు. హత్య చేసినట్లు ఆధారాలు లేకుండా చేయడానికే గురుమూర్తి ఎత్తులు వేశాడు. అయితే కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సరైన ఆధారాలు లేకున్నా చేధించారు. నిందితుడు గురుమూర్తిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయింది. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు. అందుకోసమే ఆమెని కొట్టాడు. ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది. మాధవి స్పృహ కోల్పోయిన వెంటనే ఆమెను చంపాలన్న ఉద్దేశంతో గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకుని వెళ్లాడు. కిచెన్‌లో నుంచి కత్తి తీసుకొని వచ్చాడు. ఫస్ట్ మాధవి భుజాలను కట్ చేశాడు. డెడ్ బాడీ నుంచి చేతులను వేరు చేశాడు. 


ఆ తర్వాత డెడ్ బాడీ నుంచి కాళ్లను కూడా వేరు చేశాడు. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు. ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడు. బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టాడు. శరీర భాగాలు బాగా ఉడికిన తర్వాత బకెట్‌లో నుంచి ఆ భాగాలను తీసి స్టవ్‌పై ఉంచాడు. ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్‌ను బాత్రూంలోకి వెళ్లి అనేక సార్లు ఫ్లష్ చేశాడు. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్‌లో ఉంచాడు. 


కిచెన్ డోర్, ఇంట్లో, కిటికీలు తలుపులు తెరిచి ఉంచే ఇదంతా చేశాడు గురుమూర్తి. వాసన రాకుండా ఉండేందుకు ఇలా చేశాడు. సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్‌గా చేశాడు. డిటర్జెంట్‌తో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడు. ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేశాం." అని పోలీసులు వివరాలను వెల్లడించారు. ఇంటి వద్ద విచారణ అనంతరం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలోని తలాబ్ చెరువు (మీర్ పేట్ పెద్ద చెరువు) వద్ద సీన్ రీ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. 


Also Read: Sara Tendulkar: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సచిన్‌ గారాల పట్టీ సారా టెండూల్కర్‌


Also Read: Khushi Kapoor: 'శ్రీదేవి' కుమార్తె ఖుషీ కపూర్‌ అందగత్తె కాదా? ప్లాస్టిక్‌ సర్జరీతోనే హీరోయిన్‌ ఛాన్స్‌?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.