Khushi Kapoor: 'శ్రీదేవి' కుమార్తె ఖుషీ కపూర్‌ అందగత్తె కాదా? ప్లాస్టిక్‌ సర్జరీతోనే హీరోయిన్‌ ఛాన్స్‌?

Khushi Kapoor Done Plastic Surgery For Heroine Chance: అతిలోకసుందరిగా భారత సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి అందం ఎంత వర్ణించినా తక్కువే. అంతటి అందం ఆమె కుమార్తెలకు రాలేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కుమార్తె ఖుషీ కపూర్ అసలు అందం వేరే అని.. ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకుందనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.

1 /7

సినీ పరిశ్రమలో రాణించాలంటే కొంత అందం చందంతోపాటు ఒంపుసొంపులు కూడా బాగుండాలి. కొన్ని శరీర భాగాలు కూడా కొలతగా ఉండాలనే నిబంధనలు కొందరు పెడుతుంటారు. ఇటీవల తెలుగు దర్శకుడు అలాంటి వ్యాఖ్యలే చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

2 /7

సినీ పరిశ్రమలో అందం అంటే శ్రీదేవి గుర్తుకు వస్తారు. అతిలోకసుందరిగా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన అందం శ్రీదేవి సొంతం. అయితే ఆ అందం ఆమె కుమార్తెలకు రానట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌కు శ్రీదేవి పోలికలు రాలేదు.

3 /7

అందంగా లేకపోవడంతో ఖుషీ కపూర్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకుందనే వార్త సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఖుషీ కపూర్‌ బహిరంగంగా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. 'చేసుకుంటే తప్పు ఏమిటి?' అని ఖుషీ ప్రశ్నించడం చర్చనీయాశమైంది.

4 /7

'నా కనుబొమ్మల వెంట్రుకలు ఒత్తుగా ఉండడంతోపాటు వాటి మధ్య గ్యాప్‌ కనిపించింది. అలా వదిలేయకుండా కనుబొమ్మలు సరి చేయించుకున్నా. ఆ గ్యాప్‌ ఉండకుండా చేసుకున్నా' అని ఖుషీ కపూర్‌ ప్రకటించింది.

5 /7

'అలా చేసుకున్నప్పుడు కళ్లపై కొన్ని రోజులు నీళ్లు పడరాదు. దీంతో స్నానం చేసేప్పుడు నీళ్లు పడకుండా ఓ షీల్డ్‌ ఇవ్వగా.. అది చూసి నాకు సరదాగా ఉంది. వాటిని కళ్లపై పెట్టుకుని ఫొటోలు దిగి స్నేహితులకు పంపించా. కానీ ఎవరూ దానిని ప్రశ్నించలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇలాంటివి చాలా సాధారణం' అని ఖుషీ కపూర్‌ వివరించింది.

6 /7

'ప్లాస్టిక్‌ సర్జరీ అనగానే అదేదో అవమానంగా భావిస్తారు. ఇలాంటివి పాటించడం నేరం కాదు' అని శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్‌ తెలిపింది. తాను లిప్‌ ఫిల్లర్స్‌ వేయించుకున్నట్టు కూడా తెలిపింది.

7 /7

తన సోదరి జాన్వీ కపూర్‌ మాదిరి ఖుషీ కపూర్‌ సినిమాల్లో నటిస్తోంది. 2023లో ద ఆర్చీస్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుషీ ప్రస్తుతం లవ్‌యాపా అనే సినిమా చేస్తోంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x