Megastar Chiranjeevi creating awareness on anti drug: డ్రగ్స్ మహమ్మారి  బారినపడి చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. వీరి వల్ల సమాజంలో చాలా మంది డ్రగ్స్ కు బానిసగా మారుతున్నారు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా డ్రగ్స్ కు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా, మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ పై అవగాహన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




డ్రగ్స్ ను తీసుకొవడం వల్ల యువత తమ జీవితాలు పాడు చేసుకున్న వారు అవుతారని మెగాస్టార్ అన్నారు. దీని వల్ల సమాజం పూర్తిగా పెడదారిన పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజం నిర్మించే దిశగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఎక్కడైన డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలసిన, తీసుకున్నట్లు సమాచారం అందిన వెంటనే యాంటీ డ్రగ్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో తమ వంతుగా బాధ్యతగా ప్రవర్తించాలని చిరంజీవి అన్నారు.


ముఖ్యంగా డ్రగ్స్ వంటి ఘటనల్లో దొరికిన వారిని పనిష్మెంట్ చేయడం కన్నా.. వీటి మూలాలనే సమూలంగా తుడిచిపెట్టాలని అన్నారు.అందుకే ప్రతి ఒక్కరు డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారమైన.. 8712671111 కు కాల్ చేసి చెప్పాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
 


ఇదిలా ఉండగా తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక, డ్రగ్స్ లు, మత్తుపదార్థాల వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్, మంత్రులు ఆబ్కారీ, విజిలెన్స్ అధికారులకు పూర్తి రైట్స్ ఇచ్చారు. యువతను, సమాజంను పెడదారిన పెట్టే డ్రగ్స్ లు అమ్మే వారిపైన, ఇతర ప్రదేశాల నుంచి తెచ్చే వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘాపెట్టారు. ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్టుచేశారు. తెలంగాణ సర్కారు మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకొవచ్చు.


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


డ్రగ్స్, మత్తుపదార్ధాలు అమ్మిన, ఉపయోగించిన కూడా కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే రేవంత్ సర్కారు తెల్చి చెప్పింది. ముఖ్యంగా డ్రగ్స్ ఘటనల్లో.. ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ వాళ్లు, బడాబాబుల పిల్లలు, పొలిటిషియన్లు చిక్కుకున్నట్లు గతంలో అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి