MHSRB Jobs Notification 2022: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వైద్యఆరోగ్య శాఖలో 1147 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టింట్ ఫ్రోఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించేందు అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి జనవరి 5వ తేదీని ఆఖరు తేదిగా నిర్ణయించినట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ప్రకటనలో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా మీడియాతో పంచుకున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఏయే విభాగంలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారనే వివరాలను ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 



 


అనస్థిషియా విభాగంలో అత్యధికంగా 155 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుండగా ఆ తరువాత ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగంలోనే అధికంగా 142 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలనునే అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్  mhsrb.telangana.gov.in లోకి లాగిన్ అవగలరు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రెస్ మీట్ కాపీనీ  ట్విటర్ ద్వారా షేర్ చేసిన మంత్రి హరీష్ రావు.. భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Also Read : MLC Kavitha: కవిత విజ్ఞప్తికి ఒప్పుకున్న సీబీఐ.. ఆరోజే విచారణ?


Also Read : Bandi Sanjay: ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ బానిస.. అయ్యకు తగ్గ బిడ్డగా కవిత.. బండి సంజయ్ కౌంటర్లు


Also Read : Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook