వరంగల్ : జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంటలో వలసకూలీల కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది ( Migrant workers family committed suicide ) . స్థానికంగా ఉన్న ఓ కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా ఉన్న వ్యవసాయ బావిలో దూకి నలుగురు వలస కూలీలు ఆత్మహత్యకు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. బీహార్ నుంచి  బతుకుదెరువు కోసం వరంగల్ శివార్లలోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన ఈ కుటుంబం స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ( Read also : Cyclone Amphan deaths : అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి )

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఇటీవల లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా కూలీ పని లేకపోగా.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీనికితోడు సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లే వీలు కూడా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గీసుగొండ పోలీసులు .. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన వైనం స్థానికులను కంటతడి పెట్టించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..