ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ వీరంగం సృష్టించాడు. క్రాంతి కాలనీలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో తలదూర్చిన ఫారూఖ్ అహ్మద్.. తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిలో మోసిన్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫారుఖ్ అహ్మద్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మోసిన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆదిలాబాద్ పోలీసులు.. ఫారుఖ్‌ అహ్మద్‌పై ( Farooq Ahmed ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఓటమిపాలైన ఫారుఖ్ అహ్మద్.. తన ఓటమికి కారకులైన వారిపై పగతోనే ఈ ప్రతీకార దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫారుఖ్ అహ్మద్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు ఏఐఎంఐఎం పార్టీ ( AIMIM party ) జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 


Also read : AP Cabinet Meeting Key Decisions: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook