టీఆర్ఎస్ మజ్లీస్ దోస్తీ కటీఫ్ కానుందా..? మజ్లీస్ కాంగ్రెస్ వైపు  చూస్తుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. జూనియర్ ఓవైసీ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్- మజ్లీస్ సంబంధాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి..ఇంతకీ జూనియర్ ఓవైసీ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే వివరాల్లో వెళ్లాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాసససభను రద్దు చేస్తూ టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం తర్వాత ఎంఐఎం నిర్వహించిన ఓ బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ టీఆర్ఎస్ వాళ్లు (కేసీఆర్ ను ఉద్దేశించి ) వచ్చే డిసెంబర్ తిరిగి అధికారం కైవసం చేపడతామంటున్నారు..  తమకు మద్దతిచ్చే వాళ్లకు స్వాగతిస్తామంటున్నారు.. నేను ఇదే చెబుతున్నా వచ్చే డిసెంబర్ నాటి కల్లా మజ్లీస్  పార్టీ అధికారం చేపడుతుంది.. తమకు మద్దుతు ఇచ్చే వాళ్లను స్వాగతిస్తామన్నారు. కర్నాటకలో తక్కువ స్థానాలు గెలిచినప్పటికీ కుమారస్వామి సీఎం అయినప్పుడు తాము సీఎం పదవి ఎందుకు చేపట్టకూడదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.


అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో మజ్లీస్ పార్టీ తెలంగాణలో అధికారంపై గురిపెట్టినట్లు స్పష్టమౌతుంది. కుమారస్వామి సీఎం అయినప్పుడు తాము సీఎం పదవి ఎందుకు చేపట్టకూడదని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు కైసవం చేసుకొని ఎవరికీ వత్తాసు పలకకుండా తటస్థంగా ఉంటే కర్నాటకలో జేడీఎస్ కు ఇచ్చినట్లే కాంగ్రెస్ పార్టీ  తమకు మద్దతిస్తుందని అంచనాతో మజ్లీస్ ఉన్నట్లు తేలిస్తోంది. కేసీఆర్ తో ఉన్న శత్రుత్వం వల్ల మజ్లీస్ కు అధికారం అప్పగించేందుకు టీడీపీకి కూడా అంగీకరించే అవకాశముందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఓవైసీ వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. మజ్లీస్ పార్టీ తాజా వైఖరితో తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.