Minister Errabelli Dayakar Rao speech: 2022-23 సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన మొత్తం బడ్జెట్ 25 వేల 98 కోట్ల 45 లక్షల 55 వేల (పంచాయతీ రాజ్ శాఖ 12 వేల 811 కోట్ల 92 లక్షల 11 వేలు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 12 వేల 286 కోట్ల 63 లక్షల 44వేలు) రూపాయలను శాసన సభ ఆమోదం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపాదించారు. అంతకు తగ్గని విధంగా బడ్జెట్‌ని ఆమోదించాల్సిందిగా అభ్యర్థించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాసన సభలో మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రసంగంలోంచి పలు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
పల్లె ప్రగతి కార్యక్రమం – ఓ నూతన సమగ్ర గ్రామీణ విధానం
- తెలంగాణలోని ప్రతీ పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కెసిఆర్ ఆశయం.
- పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లి విరియాలనేదే సర్కారు ప్రధాన లక్ష్యం. 
- ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ఉద్ధేశ్యం.
- 2018 నుంచి సీఎం కేసీఆర్ గొప్పగా రూపొందించిన పల్లె ప్రగతి కార్యక్రమం అమలు అవుతున్నది. 
- ఇప్పటి వరకు 4 విడుతలుగా పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. 
- ప్రతి గ్రామంలో మౌళిక వసతులైన, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఎన్నో ఏర్పాటు చేసుకున్నాం. 


14 ఏళ్ల సుదీర్ఘ‌ శాంతియుత‌ పోరాటంతో‌ తెలంగాణ‌ వ‌చ్చిన‌ త‌ర్వాత‌...
ఉద్యమ‌ నేత‌, నేటి ‌సీఎం‌ కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్నింటా అగ్రగామిగా ఎదిగింది. దూరదృష్టితో సీఎం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్నారు. మన గ్రామీణ జనాభా 60 % కాగా గ్రామాలు అభివృద్ధి చెందనిదే రాష్ట్రం, దేశంలో అభివృద్ధి జరగదు. అందుకే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చారు. దీంతో మన రాష్ట్రంలోని పల్లెల రూపు రేఖలే మారాయి. దేశంలోనే ఒక వినూత్న, విశేష పథకం పల్లె ప్రగతి. ఒకప్పుడు గ్రామాల్లో అనేక సమస్యలు ఉండేవి. నీళ్లు లేక, నిధులు లేక ఎన్నో అవస్థలు పడ్డాయి. ఒక గ్రామ సర్పంచ్ పదవికాలం మొత్తం నీటిని అందించడానికి కూడా సరిపోయేది కాదు. ఇక పారిశుద్ధ్యం అనేది ఓ కలగా ఉండేది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసింది సీఎం కేసీఆరే.
 
ప్రతీ పల్లె ఒక గంగదేవిపల్లెగా మారింది..
ఒకప్పుడు వరంగల్ జిల్లా గంగదేవి పల్లె దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశ, విదేశాల నుండి సందర్శకులు వచ్చి ఆ గ్రామాన్ని చూసి పోయేవారు. ఇప్పుడు పల్లె ప్రగతితో ప్రతీ పల్లె ఒక గంగదేవిపల్లెగా మారింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న చర్యలు తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో ఇదివరకు 8 వేల 690 గ్రామ పంచాయతీలు ఉండేవి. వాటిని 12 వేల 769 గ్రామ పంచాయతీలకు పెంచింది. ఆదివాసి, గిరిజన, కోయ, గోండు, లంబాడ సోదరులు ‘‘మా గూడంలో మా రాజ్యం’’ అనే నినాదంతో కొట్లాడిన ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు పెడ చెవిన పెట్టాయి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ 3 వేల 146 తండాలు, ఆదివాసి గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చారు.


గతంలో కేవలం 3 వేల 396 మంది గ్రామ కార్యదర్శులు మాత్రమే ఉండేవారు. ఒక్కో కార్యదర్శికి 5, 6 పంచాయతీలు ఉండేవి. ప్రతీ గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేవిధంగా 9 వేల 355 మందిని కొత్తగా నియమించాం. నూతన గ్రామ పంచాయతీ చట్టంలో సర్పంచులు, కార్యదర్శులకు అధికారాలతో పాటు బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించాం. విధుల నిర్వహణలో విఫలమయితే కఠిన చర్యలు ఉండేలా చట్టంలో మార్పులు చేశాము. సీఎం కేసిఆర్ మనసున్న మహా రాజు. అందుకే వారు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శుల జీతాలకు సమానంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాలను 15 వేల నుండి 28 వేల 710 రూపాయలకు పెంచడం జరిగింది.  


సీఎం కేసిఆర్ మహానుభావుడు....
గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాన్ని 8 వేల 500 రూపాయలకు పెంచాం. గతంలో కేవలం 9 మంది మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు (డిపిఓలు) ఉంటే, ఆ సంఖ్యను 32కు పెంచాం. డి.ఎల్.పి.వో.ల సంఖ్యను 28 నుంచి 68 కి, మండల పంచాయతీ అధికారుల సంఖ్యను 438 నుంచి 539 కి పెంచాం. అన్ని క్యాడర్లలో పదోన్నతులు కల్పించాం. దేశంలో ఎక్కడలేని విధంగా పల్లెలు, పట్టణాల ప్రగతిని పర్యవేక్షించుటకు ఒక ఐఏఎస్ అధికారిని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గా నియమించాం.


వైకుంఠ ధామాలు
- గ‌తంలో ఎవరైనా మరణిస్తే... ఆ కుటుంబంలో బతికున్నోళ్లకు ఎంత కష్టమయ్యేదో చూశాం.  
- పేదవాడికి అంత్యక్రియ‌లు ఎక్కడ‌ చేయాలో తెలియ‌ని అయోమయ ప‌రిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మర్చినం
- సిఎం కెసిఆర్ ముందుచూపుతో... ప్రతి గ్రామానికి ఒక స్మశాన వాటిక ఏర్పడింది.
- ఇప్పటి వరకు 12 వేల 729 వైకుంఠ ధామాలు పూర్తయ్యాయి.
- ఒక్కో స్మశానవాటిక అంచనా విలువ 12 లక్షల 50 వేల రూపాయలు
- ఇప్పటి వరకు మొత్తం 1 వెయ్యి 327 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. 


న‌ర్సరీలు - హరితహారం
- ఉమ్మడి రాష్ట్రంలో నర్సరీ ఎక్కడో జిల్లాకు ఒకటి, రెండో ఫారెస్టు డిపార్టుమెంట్ పరిధిలో ఉండేవి.
- మొక్కల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడే దుస్థితి ఉండేది. 
- తెలంగాణ వచ్చాక చరిత్రలో నిలిచిపోయే విధంగా సిఎం కెసిఆర్ గారు హరిత హారం కార్యక్రమం తెచ్చారు.
- పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రతి గ్రామం మరియు ఆవాసాలలో నర్సరీలు ఏర్పాటు చేశారు.
- రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా, 12,759 గ్రామాల్లో విలేజ్ నర్సరీలున్నాయి.
- ఈ సంవత్సరం ఈ నర్సరీల ద్వారా 18 కోట్ల 48 లక్షల మొక్కలు పెంచడం జరిగింది. 
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9 కోట్ల 91 లక్షల మొక్కలను నాటి, 96 శాతం మొక్కలను రక్షించుకున్నాం.


గ్రీన్ బడ్జెట్
- గ్రామ బడ్జెట్లో గ్రీన్ బడ్జెట్  (10 శాతం) నిధులు పచ్చదనానికి వినియోగించాలనే నిబంధన పెట్టినం. ఇవ్వాళ కూడా సమావేశం పెట్టి సమీక్ష చేసినం.
- ఈ నిధులు వేరే దేనికి ఖర్చు చేసే వీలు లేదు
- దీంతో 2020-21 సంవత్సరంలో 369 కోట్ల రూపాయలు గ్రీన్ బడ్జెట్  ఏర్పడింది
- తెలంగాణలో 7 శాతం ‘‘గ్రీన్ కవరేజ్’’ పెరిగిందనీ ఇష్టం లేక పోయినా కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ ప్రకటించడం ఈ పథక విజయానికి నిదర్శనం.
- ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నంగా మన హరితహారం గుర్తింపు పొందింది. 
- ఇప్పటికే ఎవరూ సాహసించని.. ఊహించని విధంగా 230 కోట్ల మొక్కలు నాటినం
- 95 శాతం మొక్కలను బ్రతికించుకున్నం
- లారీ డ్రైవర్లు రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నపుడు పచ్చదనం మొదలయితే.. తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయినట్లు, పచ్చదనం లేదంటే... తెలంగాణ సరిహద్దు దాటినట్టు ఒక ఆంధ్రా మిత్రుడు చెప్పడం ఎంతో గర్వంగా, సంతోషంగా  ఉంది.
- గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.


జనాభాతో సంబంధం లేకుండా కూడా 100, 200 జనాభా కలిగిన చిన్న గ్రామపంచాయతీలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్ధేశ్యంతో కనీసం 5 లక్షల రూపాయలకు తగ్గకుండా నిధులు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం. ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తున్నాం. ఉదాహరణకు కొత్తగూడెం జిల్లాలోని ఆల్లపల్లి గ్రామ జనాభా 106, అడవిరామారం జనాభా 107, జగిత్యాల జిల్లా కైరి గూడెం గ్రామ జనాభా 145. అయినప్పటికీ.. ఈ గ్రామపంచాయతీలకు కూడా 5 లక్షల రూపాయల నిధులు అందుతున్నాయి. గతంలో ఒకవ్యక్తికి (తలసరి) 4 రూపాయలు చొప్పున మాత్రమే ఇస్తే, ఇప్పుడు మన ప్రభుత్వం 669 రూపాయలు కేటాయిస్తోంది. ఇదే బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో తలసరిగా ఒకవ్యక్తికి కేవలం 62 రూపాయలు, కర్ణాటకలో 134 రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారు. 
  
గ్రామీణాభివృద్ధిలో ఉపాధి హామీ పనులు చేపట్టి, నిధులు వినియోగించుకోవడంలోనూ దేశంలో మనమే నెంబర్ వన్‌గా ఉన్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణాభివృద్ధికి కేంద్ర నిధులతో సమానంగా రాష్ట్రం నిధులు ఇస్తున్నది చెప్పారు. పనుల నిర్ణయం, నిధుల వ్యయంలో గ్రామ పంచాయతీలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చిన ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. ఆసరా పెన్షన్ల కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా 11,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 38 లక్షల మందికి ఇస్తున్నాం. ఒంటరి మహిళలను కూడా వదలకుండా ఇస్తున్నాం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) గుర్తుచేశారు.


Also read : Telangana Jobs: తెలంగాణలో మొదలు కానున్న ఉద్యోగాల జాతర, పోలీస్ శాఖ నుంచే ప్రారంభం


Also read : KTR Assembly Speech: అలా ఐతే.. నీళ్లు, విద్యుత్ బంద్! మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ ఝలక్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook