Harish Rao Counter to Modi: తెలంగాణ కుటుంబ పాలనలో బందీ అయిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు వచ్చి చిల్లర రాజకీయం మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తే.. నేడు బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేకపోయిన మోదీ... వరాలు ఇస్తారనుకుంటే బురద రాజకీయం చేసి వెళ్లిపోయారని విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ పాలనను కుటుంబ పాలనగా అభివర్ణించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పు పట్టారు. తాము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నేతలమని... పదవులు తమకు ప్రజలు పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. గతంలో డీఎంకే, పీడీపీ, శివసేన, అకాలీదళ్ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు అవి కుటుంబ పార్టీలని గుర్తుకు రాలేదా అని మోదీని ప్రశ్నించారు. మీ కేబినెట్‌లో నంబర్ టుగా చలామణి అవుతున్న అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ప్రశ్నించారు. అతనేమైనా క్రికెటరా అని నిలదీశారు.


ఇది కాదా రాజకీయ వారసత్వం :


ప్రధాని మోదీ మాటలు గురవింద గింజ తరహాలో ఉన్నాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మీ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొడుకు పంక‌జ్ సింగ్ రాజ‌కీయ వార‌సుడు కాదా..? మిజోరాం మాజీ గ‌వ‌ర్న‌ర్ స్వరాజ్ కౌశ‌ల్ సుష్మస్వరాజ్ భర్త కాదా..? రాజ‌స్థాన్ మాజీ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర‌రాజే కొడుకు దుష్యంత్ సింగ్ ఎంపీ కాలేదా... పీయూష్ గోయ‌ల్ తండ్రి రాజ‌కీయ నేత కాదా.. ఇదంతా వారసత్వం కాదా అని హరీశ్ రావు మోదీని ప్రశ్నించారు. 


అన్నింటా అన్యాయమే : 


తెలంగాణకు అన్నింటా అన్యాయం చేసి మొండి చేయి చూపించారని మోదీపై హరీశ్ రావు మండిపడ్డారు. ఇప్పటివరకూ జాతీయ ప్రాజెక్టు ఎందుకివ్వలేదని... కృష్ణా నదిలో వాటా ఎందుకు తేల్చట్లేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, సాంప్రదాయ గ్లోబల్ సెంటర్ జామ్ నగర్, నవోదయ, మెడికల్ కాలేజీలు, పసుపు బోర్డు ఏమయ్యాయని మోదీని హరీశ్ రావు నిలదీశారు. అభివృద్దిలో తెలంగాణ గుజరాత్‌ను మించిపోతుందనే రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. 


Also Read: Varuntej about f3 movie : ఎఫ్3 ఫ్యామిలీ అంతా కలసి మళ్లీ మళ్లీ చూస్తారు : వరుణ్ తేజ్‌


Also Read: Banking Rules: నేటి నుంచి కొత్త రూల్స్... ఆ పరిమితి దాటే లావాదేవీలకు ఆధార్, పాన్ తప్పనిసరి... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి