Trs Counter: మంటపుట్టించిన ప్రధాని వ్యాఖ్యలు, భగ్గుమన్న గులాబీ నేతలు

Trs Counter: ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకరేపాయి. కుటుంబపాలనపై మోదీ కామెంట్స్‌ టీఆర్ఎస్‌ నేతలకు కోపం తెప్పించాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చుడు అనేది ఆశ అని టీఆర్ఎస్‌ నేతలు తేల్చిచెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 09:37 PM IST
  • మంటరేపిన ప్రధాని మోదీ వ్యాఖ్యలు
  • భగ్గుమన్న టీఆర్ఎస్‌ మంత్రులు, నేతలు
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదన్న టీఆర్ఎస్‌
Trs Counter: మంటపుట్టించిన ప్రధాని వ్యాఖ్యలు, భగ్గుమన్న గులాబీ నేతలు

Trs Counter: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా బేగంపేటలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ నేతలు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇచ్చారు. తెలంగాణలో కుటుంబపాలన ఉందన్న మోదీ వ్యాఖ్యలను మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరుల గురించి ప్రస్తావించే అర్హత లేదన్నారు. మోదీ ప్రభుత్వంలో మాటలు తప్ప.. చేతలు ఏం లేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అసలు చోటు లేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ, షాలు ఇద్దరు దేశాన్ని అమ్ముతుంటే అదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో ఇప్పటికే వంద లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ.. ఆగస్టులోగా మరో 8 లక్షల కోట్ల అప్పులు చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేశాడని విమర్శించారు. నాలుగువేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయని మోదీ.. 11లక్షల కోట్ల కార్పొరేట్‌ అప్పులను మాఫీ చేశాడని గుర్తుచేశారు. కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపడం చేతగాని మోదీ యువకుల గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. నిరంకుశత్వం, కుటుంబపాలన అనే మాటలు మోదీ నోటి నుంచి వినడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముందుగా మోదీ.. అమిత్‌ షా కుమారున్నిబీసీసీఐ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. దేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని మోదీ అన్న నిరంజన్‌ రెడ్డి.. ప్రపంచదేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేశారని మండిపడ్డారు. మోదీ పాలన దూడను చీకమని.. బర్రెను తన్నమన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీ తన స్థాయి మరిచి పార్టీ అధ్యక్షునివలే మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్నారు. అయినప్పటికీ కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని గుర్తుచేశారు. అందుకే దేశం కేసీఆర్‌ నాయకత్వం కోరుకుంటుందన్నారు.  కేసీఆర్‌ దూకుడుతో మోదీలో భయం మొదలైందన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి కాదుకదా.. ముందుగా ఢిల్లీ పీఠం జాగ్రత్త అని హెచ్చరించాడు. బీజేపీ మాదిరిగా ఓట్ల కోసం దేవున్ని వాడుకోడని స్పష్టంచేశారు. ప్రధానులు వస్తారు.. పోతారు.. కానీ తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకునేది కేసీఆర్‌ మాత్రమే అని మంత్రి వేముల తేల్చిచెప్పాడు.

మంత్రి గంగుల కమలాకర్‌ సైతం ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. తెలంగాణపై మరోసారి విషం చిమ్మారని మండిపడ్డారు. కేసీఆర్‌ అన్నా.. ఆయన కుటుంబమన్నా బీజేపీకి భయమన్నారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. గుజరాత్‌ కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందన్న ఈర్శతోనే ప్రధాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు మాత్రమే తెలంగాణలో ఓట్లు అడిగే హక్కుందన్నారు.  మత విశ్వాసాల్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే బీజేపీ నేతలు మూఢ నమ్మకాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దేవున్ని గుండెల్లో పెట్టుకొని పూజించే నైజం మాదైతే, ఆ దేవున్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసేది బీజేపీ అని గంగుల విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ అసమర్థ పాలనను తరిమికొట్టేందుకు, కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి మోదీ తన హోదాను మరిచి మాట్లాడుతున్నాడని విమర్శించారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. దేశ రాజకీయాలపై కేసీఆర్‌కు ఉన్న అవగాహన, దార్శనికత, దేశ ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన చూసే .. మోదీ వణికిపోతున్నారన్నారు. బేగంపేట విమానాశ్రయం వద్ద పట్టపగలే కలలు కన్నారని, అవి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నిజం కాబోవన్నారు. తెలంగాణలోనే కాదు వచ్చే లోకసభ ఎన్నికల్లోనూ బీజేపీకి ఘోర పరాజయం తప్పదని ఈశ్వర్ సుస్పష్టం చేశారు.  వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 4 లోకసభ, 3అసెంబ్లీ సీట్లు కూడా రావని,ఈ నేలపై.. ఈ నీళ్లలో ఆ పువ్వు వికసించే అవకాశం ఏ మాత్రం లేదని కొప్పుల ఈశ్వర్ తేల్చి చెప్పారు.

ఇక ప్రధానమంత్రి తెలంగాణపై విషం గక్కాడని మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ప్రధాని హోదాలో ఉండి అబద్ధాలు చెప్పాడని మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతున్నాడని ఫైర్‌ అయ్యాడు. వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ గా ఉందని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా తెలంగాణ సాకుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ భవనం మూఢనమ్మకంతోనే కూలగొడుతున్నారా అని ప్రశ్నించారు.
 

Also Read: Varuntej about f3 movie : ఎఫ్3 ఫ్యామిలీ అంతా కలసి మళ్లీ మళ్లీ చూస్తారు : వరుణ్ తేజ్‌

Also Read: Kodali Nani: రాసిచ్చిన స్క్రిప్టులు చదవడం.. పిల్లలను రెచ్చగొట్టడం.. పవన్‌కు కొడాలి నాని కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News