Banking Rules: బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీల విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఒక ఏడాదిలో ఏదేని బ్యాంకు ఖాతా ద్వారా డిపాజిట్ లేదా విత్‌డ్రా రూపంలో రూ.20 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిపినట్లయితే ఆధార్, పాన్ నంబర్ తప్పనిసరి. కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీస్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ తెరిచేందుకు కూడా ఆధార్, పాన్ కార్డులను సీబీడీటీ తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు నేటి (మే 26) నుంచే అమలులోకి రానున్నాయి.
సీబీడీటీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం... భారీ ట్రాన్సాక్షన్స్ జరిపే వ్యక్తులు సమర్పించే పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సరైనవేనా కాదా అన్నది... వాటిని స్వీకరించే సిబ్బంది నిర్దారించాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డు లేనివారు.. భారీ ట్రాన్సాక్షన్స్ జరిపే తేదీకి కనీసం ఏడు రోజుల ముందు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలి. రూ.20 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఒకేసారి ట్రాన్సాక్షన్ జరిపినా లేదా వేర్వేరు సందర్భాల్లో జరిపినా పాన్, ఆధార్ వివరాలు తప్పనిసరిగా వెల్లడించాల్సిందే.
గతంలో ఒకరోజులో రూ.50 వేల ట్రాన్సాక్షన్స్ దాటితేనే పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చేది. రూల్ 114 బీ ప్రకారం ఒక ఏడాదిలో జరిపే విత్‌డ్రా లేదా డిపాజిట్లపై ఎటువంటి పరిమితి లేదు. సీబీడీటీ కొత్త రూల్స్ ప్రకారం... ఆయా వ్యక్తులు సమర్పించే పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు, డెమోగ్రాఫిక్ లేదా బయోమెట్రిఫ్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనుమతి మేరకు ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్ లేదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారికి సమర్పించబడుతుంది. భారీ మొత్తంలో జరిపే లావాదేవీలను సులువుగా గుర్తించేందుకు... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారి విషయంలో చర్యలకు ఈ రూల్స్ ఉపయోగపడనున్నాయి.
Also Read: Actress Death: చిత్ర పరిశ్రమలో విషాదం... ఉరేసుకుని ప్రముఖ నటి ఆత్మహత్య...
Also Read: CM Kcr comments: త్వరలో సంచలనాలు..బెంగళూరులో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి