YS Sharmila`s new party: వైఎస్ షర్మిల ప్రకటనపై మంత్రి Harish Rao కౌంటర్
Minister Harish Rao comments on YS Sharmila`s new party హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి YS Sharmila చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
Minister Harish Rao comments on YS Sharmila's new party హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి YS Sharmila చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గురించి అవగాహన లేని, ఏ పరిజ్ఞానం లేని వాళ్లు, ఏ దిక్కుమొక్కులేని వాళ్లు కూడా విమర్శలు చేసి తెలంగాణ సర్కారుని ప్రశ్నిన్నారని హరీష్ రావు మండిపడ్డారు.. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లు ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో వచ్చి ఇక్కడ రైతులను ఉద్ధరించాల్సిన అవసరం ఇక్కడ లేదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది వద్ద జరిగిన Raithu vedika ప్రారంభోత్సవంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
Also read : YS Sharmila party: వైఎస్ షర్మిల పార్టీ ఆరంభమే కాలేదు..అప్పుడే అన్ని పార్టీలు ఆగమాగమవుతున్నాయా ?
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ (New political party) ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం అందిస్తామని వైఎస్ షర్మిల ప్రకటించిన మరుసటి రోజే మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. షర్మిల వ్యాఖ్యలను తిప్పికొట్టడానికే మంత్రి Harish Rao ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు ఇచ్చిన కౌంటర్‌ని వైఎస్ షర్మిల ఎలా తిప్పికొట్టనున్నారో వేచిచూడాల్సిందే మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook