Ys Sharmila party: తెలంగాణలో వైఎస్ఆర్ బ్రాండ్ ఇప్పటికే సజీవంగా ఉందా..వైఎస్ అభిమానం తెలంగాణ ప్రజల్లో ఇంకా పోలేదా. లేకపోతే ఆరంభమే కానీ పార్టీ ప్రకటనపై అన్ని పార్టీలు అంతెత్తున ఎందుకు లేస్తున్నాయి. ఎందుకు ఆగమాగమవుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సోదరి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( YSR )ముద్దుల తనయ వైఎస్ షర్మిల ( Ys Sharmila )నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కలకలం సృష్టిస్తోంది. రాజన్య రాజ్యం తెస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆందోళన కల్గిస్తున్నాయి. లోటస్ పాండ్ సాక్షిగా వైఎస్ షర్మిల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంకా పార్టీ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. పార్టీ పేరు తెలియదు. కేవలం ఆత్మీయ సమ్మేళనంతో రాజన్య రాజ్యం ( Rajana Rajyam )పై మాత్రమే ఆమె మాట్లాడారు. సినీ భాషలో చెప్పాలంటే జస్ట్ ట్రైలర్ మాత్రమే. అప్పుడే ఇతర పార్టీల్నించి అంత వ్యతిరేకత ఎందుకొచ్చింది. కాంగ్రెస్ ( Congress ) , టీఆర్ఎస్ ( TRS ), బీజేపీ ( Bjp )పార్టీలన్నీ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టాయి.
తెలంగాణ ( Telangana )లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమే లేదన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు అవకాశం లేదని..అసలు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మూడ్రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పార్టీ పెట్టడం అంత సులభమా అని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వీహెచ్, రేవంత్ రెడ్డి ( Ravanth reddy )లు ఆరోపణలు గుప్పించారు. అన్న మీద కోపంతో చెల్లెలు తెలంగాణలో పార్టీ పెట్టుడేందని ఎద్దేవా చేశారు. అన్నపై కోపముంటే..ఆంధ్రలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో పెట్టడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీల్చడం కోసమే షర్మిల పార్టీ పెడుతున్నట్టు రేవంత్ రెడ్డి విమర్శించారు. మరి కొద్దిమంది షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని అన్నారు. ఇక బీజేపీ అయితే వైఎస్ షర్మిల పార్టీ స్థాపన ఓ కుట్రగా అభివర్ణించింది. బీజేపీని దెబ్బ కొట్టడం కోసమే షర్మిలతో కేసీఆర్ పార్టీ పెట్టిస్తున్నట్టు మండిపడ్డారు. ఇలా అందరూ వైఎస్ షర్మిల పార్టీ ( Ys Sharmila party )గురించి విమర్శలు ప్రారంభించేశారు.
ఇంకా ఆరంభమే కాని పార్టీ గురించి అంతలా ఆగమాగమవుతున్నారంటే.. నిజంగా భయం పట్టుకుందా అన్పిస్తుంది. ఇంకా పురుడే పోసుకోని పార్టీపై వ్యతిరేకత వ్యక్తం చేయడం దేనికి సంకేతమో అర్ధం చేసుకోవాలి. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుతో లాభపడుతున్న బీజేపీ మాత్రం అప్పుడే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడినట్టు కన్పిస్తోంది.
Also read: Ys Sharmila meeting: అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలున్నాయా...షర్మిల సమావేశం దేనికి సంకేతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook