మాతృదినోత్సవం రోజున మంత్రి హరీష్ రావు.. మంచి పని చేశారు. అమ్మను ఆదుకోవాలంటూ ఓ నిస్సహాయ యువకుడు వాట్సాప్ ద్వారా కోరిన కోరికను నెరవేర్చారు. అంతే కాకుండా ఆ మాతృమూర్తికి అయ్యే వైద్య ఖర్చులను కూడా భరిస్తూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నంట యాదిరెడ్డి తల్లి పద్మ గత కొంత కాలంగా వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్నారు. అసలే పేదరికం పైగా...  లాక్ డౌన్ సందర్భంలో ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో  తల్లి బాధను వివరిస్తూ...  మా అమ్మను ఆదుకోవాలని మంత్రి హరీశ్ రావుకు వాట్సాప్ సందేశాన్ని పంపారు నంట యాదిరెడ్డి. దీనిపై స్పందించి మంత్రి హరీష్ రావు..  అమ్మకు ఏం కాదు...  అధైర్యపడొద్దని.. అండగా నేనుంటానని యాదిరెడ్డికి భరోసా ఇచ్చారు. 


నంట పద్మకు కావాల్సిన మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను హైదరాబాదులోని కేర్ ఆసుపత్రికి తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం నంట పద్మకు మెరుగైన వైద్య చికిత్సకు అవసరమైన 2 లక్షల రూపాయలతోపాటు ఎల్ఓసీ పత్రాన్ని కూడా నంట యాదిరెడ్డికి అందించారు మంత్రి హరీశ్ రావు. 


 మంత్రి  సాయం చేయడంతో నంట యాదిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తన తల్లికి  మెరుగైన వైద్యం అందించేందుకు చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..