మెదక్ : పాపన్నపేట్‌లో బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడిని ( Boy trapped in borewell ) సురక్షితంగా వెలికి తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao ) తెలిపారు. బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు (Rescue operations ) చేపడుతున్నామని చెప్పిన మంత్రి హరీశ్ రావు.. హైదరాబాద్ నుండి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ నిపుణుల బృందాలను ఘటన స్థలానికి పిలిపించామని మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్ రావు.. తెరిచి ఉంచిన బోరుబావుల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. బోరుబావులు తెరిచి ఉంచి ఇలాంటి ప్రమాదాలకు కారకులయ్యేలా నిర్లక్ష్యంగా వ్యవహరించే బోరు బావుల యజమానులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ( Boy fell into borewell : బోరుబావిలో పడిన బాలుడు.. మొదలైన రెస్క్యూ ఆపరేషన్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మరోవైపు ఘటనాస్థలంలో బాలుడిని రక్షించేందుకు సహాయకార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తూనే మరోవైపు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాత, తండ్రితో బోరుబావి వైపు వెళ్లిన బాలుడు.. ప్రమాదవశాత్తుగా అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..