Harish Rao: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్..త్వరలో మరో గ్రూప్ నోటిఫికేషన్..!
Harish Rao: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ రానుంది. దీనిపై మంత్రి హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు.
Harish Rao: నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. కొత్త పెన్షన్‌దారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రూప్-4 కింద 20 వేల ఉద్యోగాలకు భర్తీ చేస్తామన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని స్పష్టం చేశారు. పేదలను అండగా ఉండేందుకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 తో ఫించన్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉచితాలు బంద్ చేయాలని బీజేపీ నేతలు చెబుతున్నారని..ఏది ఉచితం..ఏది అనుచితమో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా బడా నేతలకు రుణమాఫీ చేసిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం..నిత్యావసర ధరలను పెంచి..పేదలపై భారం మోపిందన్నారు మంత్రి హరీష్‌రావు. రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.12 వందలకు పెంచారని విమర్శించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు. ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణలో నిరుపేదలకు అండగా ఉన్నామన్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
మరోవైపు తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. రాష్ట్రంలో 90 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక శాఖ నుంచి నోటిఫికేషన్ వస్తోంది. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేయనుంది. ఈసారి భారీ స్థాయిలో గ్రూప్-4 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
[[{"fid":"243662","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:Chandrababu: రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకు..ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి