Harish Rao On Rythu Bandhu: కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ అని.. రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. రూ.75 వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే.. కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయరని.. 69 లక్షల రైతులు కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే.. పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోందన్నారు. రైతుల జోలికి వస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రైతుల జోలికి వస్తే.. డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరిస్తున్నాము. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. కర్ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్‌లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నాం. రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది. రైతుబంధు పొందిన 69 లక్షల రైతులు కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడతారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు కేసీఆర్ ఇచ్చారు.


కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారింది. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధుకు రాం రాం పెడతారు. మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తారు. 11 సార్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదు.. మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11సార్లు రైతు బంధు ఇచ్చాం. మా అంటే ఒక నెల రోజులు కాంగ్రెస్ కుట్రలతో పథకాలు ఆగినా మళ్లీ మేము రాగానే ఇస్తాం. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాము.." అని హరీష్ రావు తెలిపారు. 


2009 ఎన్నికల మేనిఫెస్టోలో 9 గంటల పగటిపూట రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. 9 గంటలు కాదు కదా.. కనీసం మూడు గంటల కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. "ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోతే బావి దగ్గర స్నానం చేద్దామంటే కరెంట్ రాలేదని అన్నాడు. కరెంట్ కోసం ఎదురు చూసి.. ఎదురు చూసి.. నెత్తి మీద నీళ్లు జల్లుకుని పోయినా అని చెప్పినాడు. కానీ ఈ రోజు మాట మారుస్తున్నాడు.." అని మంత్రి మండిపడ్డారు.


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   


Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook