Minister Harish Rao: కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి.. తెలంగాణపై కేంద్రం దోపిడి: మంత్రి హరీష్ రావు ఫైర్
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు.
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గల్లంతు చేశారు. నెత్తి లేని, కత్తి లేని నేతలు నత్తి నత్తి మాట్లాడుతున్నారు అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
మెదక్ జిల్లా శివ్వంపేటలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించినట్టుగానే ఇప్పుడు కేంద్రం కూడా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం అడిగినా.. కేంద్రం అది ఇవ్వడం లేదు. మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, నవోదయలు ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలేదు, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, జాతీయ హోదా ఇవ్వలేదు. ఏది అడిగినా ఇవ్వడం లేదు. ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీకీ పట్టిన గతే ఇకపై బీజేపికి కూడా పడుతుంది అని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని హెచ్చరించారు. తెలంగాణకు హక్కుగా రావల్సినవి కేంద్రం ఇవ్వడంలేదు. ఈ విషయాన్ని మీరంతా ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి అంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు హితబోధ చేశారు
పెట్రోల్, డీజిల్‌పై సెస్సుల పేరిట కేంద్రం 8 ఏళ్లలో 89 వేల కోట్లు వసూలు చేసింది. సెస్సుల పేరిట కేంద్రం అడ్డదారిలో ప్రజలను దోపిడీ చేస్తోంది. గడిచిన 9 ఏళ్లలో 89,967 కోట్లు పెట్రోల్, డీజిల్ మీద సెస్సుల రూపంలో బిజెపి తెలంగాణ నుండి వసూలు చేసింది అని గణాంకాలతో సహా వివరించారు. క్రూడ్ అయిల్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గాలి. కానీ తగ్గడం లేదు. సెస్సుల రూపంలో దొడ్డి దారిన పేదల నుండి పిండుతున్నరు. ట్రాక్టర్ మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద.. ఇలా ఏది కనిపిస్తే దాని మీద సెస్సు వేస్తూ ప్రజలను కేంద్రం దోచుకుంటోంది అని మంత్రి హరీష్ రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధికి కారణం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు.. కేసీఆర్ అనే అద్భుత దీపమే తెలంగాణ అభివృద్ధికి కారణం. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. మ్యాజిక్ వల్లో లేక మంత్రం వల్లో కాలేదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కార్యకర్తలు పార్టీకి పట్టు కొమ్మలు లాంటి వారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు చరుకుగా పని చేయాలి అని చెప్పి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మీకు ఏ కష్టం వచ్చినా.. 24 గంటలు నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి అని నేతలు, కార్యకర్తలకు సూచించారు.
9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం తెలంగాణ జనమే గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలి అని మంత్రి హరీశ్ రావు కోరారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు వంటి పథకాలు నాడు ఉండెనా అని ప్రశ్నించారు. నాడు అన్నదాత ఏడుపు, ఆకలి కేకలు.. నేడు అవి లేకుండా చేశారు. పండిన పంట గింజ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. నాడు అట్టడుగులో ఉన్న తెలంగాణ, నేడు దేశానికి ఆదర్శం అయ్యింది. మెదక్ ఒక ప్రత్యేక జిల్లా అవుతుందని కల కన్నామా.. అలాంటిది జిల్లాగా చేసుకోవడంతో పాటు 84 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. అలాగే నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అయ్యింది. ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ, టిడిపిలు చేయని పనులను కేవలం ఈ 9 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించింది అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : Etala Rajender Slams KCR: కేసీఆర్, కేటీఆర్ లకు చురకలంటించిన ఈటల
ఇది కూడా చదవండి : Revanth Reddy To KTR: పరువు ఉంటే కదా పరువు నష్టం దావా వేసేది.. కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK