Etala Rajender Slams KCR: కేసీఆర్, కేటీఆర్‌లకు చురకలంటించిన ఈటల

Etala Rajender Slams KCR: భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా వారసత్వంతో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా.. అది ఒక కుటుంబ పార్టీ, అందుకే కునారిల్లిపోతున్న దుస్థితిలో ఉంది. కార్యకర్తల కమిట్మెంట్, ప్రజల ఆశీస్సులతోనే గెలుపు సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 06:54 AM IST
Etala Rajender Slams KCR: కేసీఆర్, కేటీఆర్‌లకు చురకలంటించిన ఈటల

Etala Rajender Slams KCR: భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా వారసత్వంతో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా.. అది ఒక కుటుంబ పార్టీ, అందుకే కునారిల్లిపోతున్న దుస్థితిలో ఉంది. కార్యకర్తల కమిట్మెంట్, ప్రజల ఆశీస్సులతోనే గెలుపు సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అందుకే పార్టీకి ఒక అడ్రస్ ఉండాలని.. పార్టీ ఆఫీస్ ఒక భరోసా కేంద్రంగా ఉండాలి కిరాయి బిల్డింగ్ ఉండవద్దు, ప్రజలకు విశ్వాసం కల్పించే కేంద్రంగా ఉండాలి అనే గొప్ప భావనతో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు వరంగల్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఈటల ఆనందం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో  విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ అసెంబ్లీలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ప్రధానమంత్రిగా వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు గాక కానీ వారు వ్యక్తులు కాదు వ్యవస్థకు ప్రతిరూపం అని చెప్పారు కేసీఆర్. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ వేదికగా ప్రధానమంత్రిని పట్టుకొని అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నప్పుడు ఇదేమి సంస్కారం అని కేసిఆర్ నిలవరించారు.
 కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన తనయుడు.. ఇంకా ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం ఆయన కాళ్ల దగ్గర ఉండే మంత్రులు ప్రధానమంత్రిని తులనాడుతున్నారు. వారు కించపరిచేది నరేంద్ర మోడీని కాదు.. వారు ఇన్సల్ట్ చేస్తుంది దేశ ప్రజాస్వామ్యాన్ని. వారు తూలనాడుతుంది దేశ ప్రజాస్వామ్యాన్ని వ్యక్తులను కాదు ఈటల రాజేందర్ మండిపడ్డారు..

భారతదేశమంటే పేద దేశమని, అడుక్కునే దేశమని, ఇతర దేశాల మెప్పుతో బతికే దేశమని చిన్నప్పటి నుంచి ఒక అభిప్రాయం ఉండేది. కానీ భారతదేశం ఆత్మన్యూనతతో బతికే దేశం కాదు..ఆత్మగౌరవంతో బ్రతికి దేశమని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. చాయి అమ్ముకునే సామాన్య వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రిగా ఎదగడానికి అవకాశం ఉందని నిరూపించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది ఇంకో పార్టీలో అవకాశం లేదు. కేసీఆర్ గారిని అడుగుతున్నాను.. టిఆర్ఎస్ పార్టీకి మీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వ్యక్తి దేశ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ బిఆర్ఎస్ పార్టీకి మీ కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అని అడుగుతున్నాను అని బీఆర్ఎస్ నేతల వైఖరిని నిలదీశారు.

మూడో మాట రేపు నీ పార్టీ అధికారంలోకి వస్తే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అధికారం చెలాయిస్తారు తప్ప మరో వ్యక్తికి అవకాశం ఉందా?  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినన్ని రోజులు వేరే వారు ముఖ్యమంత్రి య్యే అవకాశం ఉందా? అంటే లేదు లేదు లేదు... అందుకే మీ దాంట్లో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఒక దళిత బిడ్డ ఈ పార్టీకి అద్యక్షుడు అయ్యే అవకాశం లేదు.  ఉద్యమం కోసం పుట్టిన పార్టీని కుటుంబపరం చేసుకున్నావు. అది పతనమవడం ఖాయం.

కేసీఆర్ ది ప్రజా కంటక ప్రభుత్వం. దానికి సజీవ సాక్ష్యం అక్రమ అరెస్టులు. కాకతీయవిశ్వవిద్యాలయం లోపల ఏళ్ల తెరపడి చదువుకున్నాం ఉద్యోగాలు కావాలి అని అడిగితే అరెస్టులు చేస్తున్నారు.  మా అమ్మ కూరగాయలమ్మి, నాన్న ఆటో నడిపి, నాటువేసి..కలుపుతీసి.. సంపాదించి పంపిన డబ్బులు 20 ఏళ్లుగా చదువుకున్నాము. మా అమ్మ ఆశపడింది నేను ఉద్యోగం చేస్తే చూసి మురవాలని. కానీ 10 ఏళ్లకు కూడా నోటిఫికేషన్లు రావు. 2011లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడితే మళ్లీ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు అదీ కూడా రద్దు చేశారు. బీహార్ చాలా వెనుకబడిన రాష్ట్రం అనుకుంటాం కానీ బీహార్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతాయో అన్ని ఉద్యోగాలు నింపుతున్న ప్రభుత్వం బీహార్లో ఉంది.. కానీ తెలంగాణలో అది లేదు. తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామాల కోసం. నేను అడుగుతున్న కేసీఆర్ గారు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు1 లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు నింపుతామని మొదటి బడ్జెట్ సమావేశంలో సమాధానం ఇచ్చారు.  మొత్తం మీరు ఇచ్చిన ఉద్యోగాలు,కాంట్రాక్ట్ వారిని పర్మినెంట్ చేసిన అన్ని కలిపితే కూడా లక్ష ఉద్యోగాలు దాటలేదు. కొట్లాడిన విద్యార్థులకు ఆశాభంగం కలిగింది తప్ప ఉద్యోగాలు రాలేదు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి : Minister Harish Rao: కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి.. తెలంగాణపై కేంద్రం దోపిడి: మంత్రి హరీష్ రావు ఫైర్

ఇది కూడా చదవండి : Revanth Reddy To KTR: పరువు ఉంటే కదా పరువు నష్టం దావా వేసేది.. కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News