Minister Harish Rao Comments: సర్పంచ్‌లకు మంత్రి హారీష్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. కులబ్‌గుర్‌లో దీనదయాళ్ జాతీయ పంచాయతీ 2021-22 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయని తెలిపారు. మన దగ్గర ఇంటింటికి ప్రతి రోజు నీరు వస్తుందని.. ఇది తెలంగాణ మోడల్ అని అన్నారు.
'నిన్న సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారు.. 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందట.. బీదర్‌లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచుకుంటున్నారట.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఇది పరిస్థితి. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ రూ.10 వేలు ఇస్తున్నారు.. బీజేపీ వాళ్లు 10 వేలు సరిపోవు అంటున్నారు. ఢిల్లీ నుంచి 10 వేలు తెచ్చి.. మీరో 10 వేలు ఇవ్వండి.. ఇద్దరం కలిపి 20 వేలు ఇద్దాం.. బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు
నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ.. పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ.. గ్యాస్ ధరలు పెంచారు. మోటర్లకు మీటర్లు పెట్టారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా ఎందుకు చేయలేదని బీజేపీ వాళ్లు అడుగుతున్నారు.. ముందు మీ ప్రధాని రాష్ట్రంలో అమలు చేయండి. ప్రధానమంత్రి సంసద్ యోజనలో 10కి 10 తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయి..' హారీష్ రావు తెలిపారు.
సర్పంచ్‌లకు శుభవార్త చెబుతున్నామని.. ఏప్రిల్ 1 నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో నిధులు వేస్తామని వెల్లడించారు. పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించామన్నారు. గతంలో సర్పంచ్‌లకు కాలిపోయిన మోటర్లకు రిపేర్ చేయించుడే పని.. బావులను తవ్వుడే పనిగా ఉండేందన్నారు. ఆనాడు అంతా ఎర్ర దీపాలు, గుడ్డీ దీపాలు కరెంట్ సరిగా లేకుండేనని.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన 24 గంటల కరెంట్ వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!
Also Read: IPL 2023: ఐపీఎల్ 2023లో ఈ ఐదుగురి ఆటగాళ్లపై ఓ కన్నేయండి.. క్రీజ్‌లోకి దిగితే బౌలర్లకు వణుకే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి