Harish Rao Slams PM Modi: విదేశాల్లో మూలుగుతున్న నల్లదనం తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఏమయిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిలదీశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని స్థానిక ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎన్నికల వాగ్ధానలపై మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న కల డోంగ్లీని మండల కేంద్రంగా ప్రకటించడం అని.. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడి స్థానికుల కలను నిజం చేస్తూ డొంగ్లి మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ చేసి దేశ వ్యాప్తంగా అమలు చేస్తుందని అన్నారు. 


తెలంగాణ వైపు చూస్తోన్న యావత్ దేశం.. 
దేశానికి సంక్షేమ పథకాలు అందించి దేశం తెలంగాణ సర్కారు వైపు తిరిగి చూసేలా చేసిందని.. తద్వారా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం లేనప్పటికీ.. రైతు బంధు సంక్షేమ పథకం ఆగకుండా రైతుల ఖాతాలలో డబ్బులు జమచేసిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు. 


అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడంతో పాటు వ్యవసాయ బోరు బావుల వద్ద మీటర్లు వద్దన్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే అని అన్నారు. జుక్కల్ నియోజక వర్గంలో ఉన్న ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి హరీశ్ రావు ( Minister Harish Rao ) స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బాగున్నాయని తెలంగాణకు ఆనుకుని ఉన్న ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారని మంత్రి తెలిపారు.


Also Read : Kavitha Flexies: డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు!


Also Read : Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు


Also Read : Pawan Kalyan: నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్..జనసేనాని వ్యాఖ్యలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook