నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఒక్కసారిగా అక్కడున్నవారిలో కలకలం రేగింది. కాదంటూ కేకలు పెట్టారంతా. అయినా పవన్ కళ్యాన్ తన వ్యాఖ్యలు కొనసాగించారు. అసలేం జరిగింది..పవన్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు..ఆ వివరాలు మీ కోసం..
హైదరాబాద్ శిల్పకళావేదికలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ ఎక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న విద్యార్ధుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే
నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ని. లేదు..వాస్తవాన్ని అంగీకరించాలి. నేనేమీ ఇందుకు బాధపడటం లేదు. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ హాఫ్ వే టు సక్సెస్. నేను నా వైఫల్యాల్ని మంచిగానే భావిస్తాను. చెడుగా భావించను. ఎందుకంటే నేను ఎంతో కొంత సాధించాను. సమాజంలో మార్పుని కోరే ఇతరుల్లా నేను కాను.
ఈ మాటలు చెబుతున్నప్పుడు మధ్యమధ్యలో అక్కడున్న విద్యార్ధులు కాదంటూ కేకలు పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ వారిని వారిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2019 ఎన్నికల్లో దెబ్బతిన్నాను. కానీ అక్కడితో నేను ఆగిపోలేదు. నా ఓటమి నుంచి కొన్ని విషయాల్ని నేర్చుకున్నాను. ఈ రోజు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడ్డాను. మీరు కూడా అలాగే ఉండాలి. సీఏ పాస్ కావడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకండి అంటూ పవన్ కళ్యాణ్ ముగించారు.
మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పటికీ మర్చిపోకండి..వాళ్లే మీకు హీరోలు. మన జీవితంలో మధ్యలో ఎవరు వచ్చినా..ఎవరు వెళ్లినా...మన తుది శ్వాస వరకూ ప్రేమగా ఉండేది తల్లిదండ్రులేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నా దృష్టిలో ఛార్టెడ్ ఎక్కౌంట్ ఉన్నంత స్వచ్ఛంగా ఎవరూ ఉండరు. జవాబుదారీతనానికి పర్యాయపదం వాళ్లని పవన్ వ్యాఖ్యానించారు. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల్ని ఉదహరిస్తూ విద్యార్ధుల్లో చైతన్యం నింపే మాటలు చెప్పారు.
అయితే రాజకీయంగా ఫెయిల్ అయ్యానని చెప్పడంలో ఆయన నైరాశ్యం కూడా కన్పిస్తుందని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఓ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కడి విద్యార్ధుల్లో ఉత్సాహం నింపవచ్చు గానీ..కార్యకర్తల మనస్థైర్యం దెబ్బతింటుందని విమర్శిస్తున్నారు ఇంకొందరు.
Also read: Bandi Sanjay: బండి సంజయ్ సంచలన నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook