Minister Harish Rao: బీజేపి నేతలపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు

Minister Harish Rao: బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 10:33 AM IST
  • ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడి దాడులు, ఐటి సోదాలు మామూలయ్యాయన్న మంత్రి హరీశ్ రావు
  • ఈడి దాడులు, ఐటి సోదాలకు భయపడేది లేదన్న మంత్రి
  • బీజేపి నేతల ఆటలు తెలంగాణలో చెల్లవని హితవు
Minister Harish Rao: బీజేపి నేతలపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు

Minister Harish Rao: బిజెపి చేసే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికలు వస్తే చాలు.. ఈడీ దాడులు, ఐటీ దాడులు చేయించి రాజకీయ పార్టీలను భయపెట్టాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి భావిస్తోంది. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అణిచేసేందుకు బిజెపి ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని వేధింపులకు పాల్పడినా.. ప్రజల కోసం పోరాటం చేసేందుకు తాము ఎదురొడ్డి నిలబడతాం అని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 

మంత్రి మల్లా రెడ్డి నివాసం, వ్యాపార కార్యాలయాలు, కాలేజీలపై ఇన్‌కమ్ టాక్స్ రైడింగ్ మొదలుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించడం, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించడం, చికోటి ప్రవీణ్ క్యాసినో లీలలపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కీలక నేతల అరెస్ట్ కూడా జరగొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా బీజేపి రాజకీయాలకు తలవంచం అని కేంద్రాన్ని హెచ్చరించిన మంత్రి హరీశ్ రావు.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎవరితోనైనా, ఎక్కడివరకైనా గట్టిగానే పోరాడతాం అని అన్నారు. బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు స్పష్టం చేశారు. 

బిజేపి పాదయాత్రలకు జనం ఆధరణ కరువైందని.. జనం రాకపోవడంతో బీజేపి చేపడుతున్న పాదయాత్రలు వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపి నేతలు చేపట్టే పాదయాత్రల్లో మాటలేమో ఎక్కువ.. ప్రజలేమో తక్కువ అని విమర్శించారు. ఇదిలావుంటే, బీజేపి పాదయాత్రలకు జనం తక్కువ అని మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కుంటాల వద్ద చేపట్టిన పాదయాత్రలో కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపి పాదయాత్రలకు జనం కరువైనప్పుడు భైంసా పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అనుమతి ఇవ్వలేదంటే బీజేపిని చూసి కేసీఆర్ వణుకు మొదలైందనే కదా అర్థం అంటూ టీఆర్ఎస్ నేతల విమర్శలకు బండి సంజయ్ ( Bandi Sanjay ) ధీటుగా సమాధానం ఇచ్చారు.

Also Read : Bandi Sanjay: టిఆర్ఎస్ నేతల కళ్ళు దొబ్బాయా ? బండి సంజయ్ ఫైర్

Also Read : Minister KTR: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్.. రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు

Also Read : TSPSC Group 4 Notification: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ 9 వేల గ్రూప్ 4 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News