హైదరాబాద్: ఏపీకి మూడు రాజధానుల ప్రకటన, అమరావతి నుంచి రాజధాని మార్పు వంటి అంశాలు తెలంగాణలోకి పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు అనుకూలంగా మారుతుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఓవైపు అమరావతి నుంచి రాజధానిని మార్చకూడదంటూ ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు రాష్ట్రంలో కొత్త రాజధాని ఎక్కడుంటుందనే అయోమయం ఆ రాష్ట్రాన్ని వేధిస్తోందని.. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల చూపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌పైనే పడుతుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినట్టుగా ది హన్స్ ఇండియా కథనం పేర్కొంది. రాజధాని విషయంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా హైదరాబాద్‌కి కొత్త పరిశ్రమలు రావడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుంటుందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడినట్టుగా ఆ కథనం స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతోపాటు అమరావతి రైతులకు వైసిపి నేతల హామీ


మూడు రాజధానుల ప్రకటన కొత్తగా అమరావతిలో పెట్టుబడి పెట్టే వారిని అయోమయంలో పడేస్తుంది కనుక వారి చూపు హైదరాబాద్‌పైనే పడుతుందని వ్యాఖ్యానించిన మంత్రి హరీష్ రావు.. ప్రస్తుతం ఐటి నిపుణులు, బ్యూరోక్రాట్స్, వ్యాపారవర్గాలు హైదరాబాద్‌లో స్థిరపడేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పినట్టుగా సదరు కథనం వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..