సంగారెడ్డి: జిల్లా కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వివిధ సబ్జెక్టులపై వారికి ప్రశ్నలు వేసిన మంత్రి హరీష్ రావుకి.. విద్యార్థుల నుంచి వచ్చిన సమాధానాలు విని అవాక్కయ్యారు. కొంతమంది విద్యార్థులు తెలుగులో కూడా పేర్లు సరిగ్గా రాయలేకపోవడంపై మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల చదువు ఇలా ఉంటే వారు 10వ తరగతి ఎలా పాసవుతారని అక్కడున్న టీచర్లను ప్రశ్నించారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఎక్కాలు చెప్పలేకపోవడం మంత్రిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. 10వ తరగతి విద్యార్థుల చదువులు ఇలా ఉంటే వారు ఎలా పాస్ అవుతారు ? బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీపడతారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.
ఓవైపు పరీక్షలకు సమయం దగ్గరపడుతోంటే... మరోవైపు విద్యార్థులు ఇంత వెనుకబడిపోతే ఎలా అని మంత్రి హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసే తీరు ఇదేనా అంటూ పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీష్ రావు మండిపడినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..