ఆరేళ్ల చిన్నారి సుప్రియ రాసిన లేఖకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. చిన్నారి రాసిన లెటర్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంటూ ఆమె కోరికను తప్పక తీరుస్తానని చెప్పారు. ఇంతకీ ఆ పాప ఏం రాసిందో తెలుసా?...
"డియర్ కేటీఆర్ అంకుల్..  నేను సుప్రియని. వయసు ఆరు సంవత్సరాలు. ఆల్వాల్ హిల్స్ లోని సెయింట్ పీయస్ టెన్త్ స్కూల్ లో ఒకటో తరగతి చదువుకుంటున్నాను. సుచిత్రా జంక్షన్ వద్ద పిల్లలు అడుక్కుంటున్నారు. వారికి ఉండేందుకు ప్రదేశం, ఆహారం, విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం నా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 2000 రూపాయలను మిమ్మల్ని కలిసి ఇస్తాను" అని రాసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ పాప తండ్రి నాగేశ్వరరావు కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ, లెటర్ ను ట్విట్టర్ లో పోస్టు చేయగా, దాన్ని చూసిన కేటీఆర్ స్పందించారు. " సార్.. మీ పాపకు నా తరఫున థ్యాంక్స్ చెప్పాలని, ఆ పాప చెప్పిన చిన్న పిల్లల పట్ల తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము' అని చెప్పారు. ఇక ఆ పాప తన కిడ్డీ బ్యాంకు సేవింగ్స్ ను ఇస్తానని చెప్పడం తనకెంతో నచ్చిందని వ్యాఖ్యానించారు.