Minister KTR Review Meeting: రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై అధికారులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయక సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో ఇతర శాఖలతోనూ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధికారులకు, సిబ్బందికి సెలవులను ఇప్పటికే రద్దు చేశామన్న కేటీఆర్.. ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలన్నారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని.. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించాలని అన్నారు. సహాయక కార్యక్రమాలు ఎలాంటి అవసరం ఉన్నా స్వయంగా తన కార్యాలయంతో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉంటారని తెలిపారు. 


"వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపై ఎక్కువ దృష్టి సారించండి. సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్‌తో పాటు ప్రతి జిల్లాలోని కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోండి. పట్టణాల్లో ముఖ్యంగా ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలి. పట్టణాల్లో ఉన్న రహదారులను వెంటనే మోటరబుల్‌గా తయారు చేయాలి. దీని కోసం అవసరమైన తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్‌ని చేపట్టాలి. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల పిచికారి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి..


పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు డివాటరింగ్ పంపులను కూడా వినియోగించండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలి. ప్రజలు తాగునీటిని కాచి వడపోసుకొని వినియోగించాలని అవగాహన వచ్చే చర్యలు తీసుకోవాలి. వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. పట్టణాల్లో ఉన్న బస్తీ దవాఖానాలు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలి. విద్యుత్ శాఖతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని మరమ్మతు కార్యక్రమాలను చేపట్టాలి.." అని కేటీఆర్ సూచించారు. 


Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్  


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి