Minister KTR Fires On Congress: నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నాడు దాశరథి జైల్ గోడలమీద రాశారని.. నేడు సీఎం కేసీఆర్ తెలంగాణ కోటిరత్నాల వీణనే కాదు.. కోటిన్నర మాగాణి అని నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ములుగులో నిర్వహించిన సాగునీటి దినోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో మండు వేసవిలో ఏనాడైనా నీళ్లు కనిపించాయా..? అని ప్రశ్నించారు. తాగునీరు ఇవ్వక చావగొట్టి.. సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్ కాదా..? అని అడిగారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనరని.. పెట్టుబడి ఇవ్వరని అన్నారు కేటీఆర్. కానీ ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టేలా డైలాగ్‌లు చెబుతారని ఫైర్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు ఎదురుచూసిన 3100 తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ మార్చారని గుర్తుచేశారు. ములుగులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా.. కేసీఆర్ నలుగురు మంత్రులను పంపించి పలు అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ములుగును మున్సిపాలిటీని మార్చామని తెలిపారు. ములుగులో కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు 133 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ వస్తే ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారని.. అలాంటి వారికి జాతీయస్థాయిలో ములుగు సెకెండ్ ప్లేస్‌లో నిలిచిన ఘనత చాలదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.  


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం ఎవరి హాయంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు సమీక్షించుకోవాలని కోరారు. ఒకసారి పొరపాటు జరిగిందని.. మరోసారి జరగదని హామీ ఇచ్చారు. ములుగు ప్రజలు తెలివైన వారు అని.. ఎవ్వరు చెప్పినా వింటారని కానీ చేసే పని చేస్తారని అన్నారు. దేశంలోనే ఎక్కడా జరిగినంత అభివృద్ధి ములుగు నియోజకవర్గంలో జరిగిందన్నారు. 


Also Read: MSP for Kharif Crops: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. పంటల మద్దతు ధర పెంపు  


"ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.. అక్కడ కరెంట్ ఇవ్వరు.. కానీ ఇక్కడ అడ్డగోలుగా మాట్లాడుతారు. కాంగ్రెస్ నాయకులు చేయరు... చేసే వాళ్లను చేయనీయరు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ములుగులో తట్టెడు మట్టి పోయలేదు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు ఇచ్చే హామీలు వారు పాలించే రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలి. పాలించే రాష్ట్రాల్లో అమలు చేయరు... కానీ ఇక్కడ అడ్డగోలుగా మట్లాడతారు. ములుగులో ఎవ్వరిని అభ్యర్థిగా పెట్టిన 30 వేల మెజార్టీతో గెలిపిస్తాం‌.. ఐక్యంగా అందరం కలిసి పార్టీ కోసం పని చేస్తాం.. కేసీఆర్ రుణం తీర్చుకుంటాం." అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.


Also Read: Railway recruitment 2023: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.1,40 వేల వరకు జీతం.. అర్హత వివరాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook