KTR on Andhra Pradesh : తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పక్క రాష్ట్రంలో సరైన మౌలిక సదుపాయాలు లేవంటూ తనకు తెలిసిన మిత్రుడొకరు వాపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చితే మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ చాలా మెరుగ్గా ఉందని బయటి రాష్ట్రాల మిత్రులు చెబుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం (ఏప్రిల్ 29) క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నాకో మిత్రుడు ఉన్నాడు. సంక్రాంతి పండగకు పక్క రాష్ట్రానికి వెళ్లి వచ్చారు. అక్కడ వాళ్లకు తోటలు, ఇళ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్లి వచ్చాక నాకు ఫోన్ చేశారు. కేటీఆర్ గారూ ఒక పనిచేయండి... రాష్ట్రంలోని ప్రతీ గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి. నేను మా గ్రామంలో ఉన్నన్ని రోజులు కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి. అన్యాయంగా, అధ్వాన్నంగా ఉంది. తిరిగి హైదరాబాద్ వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది. మనవాళ్లను అక్కడికి పంపిస్తే మన ప్రభుత్వం ఏం చేస్తుందో వారికి తెలిసొస్తుంది.' అని కేటీఆర్ పేర్కొన్నారు.


అంతేకాదు, తాను మాట్లాడుతున్నది అతిశయోక్తిగా అనిపిస్తే.. డబ్బా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తే... కారేసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లి చూసి రావాలని అన్నారు. మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. తాను మాట్లాడుతున్నది కొంతమంది నచ్చకపోవచ్చునని.. కానీ వాస్తవాలు అలా ఉన్నాయని పేర్కొన్నారు. 


మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ అన్ని రకాలుగా బాగుందన్నారు కేటీఆర్. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నందునే పరిశ్రమలు ఇక్కడికి క్యూ కడుతున్నాయని చెప్పుకొచ్చారు. 


Also Read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?


Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయొద్దు... చేస్తే అశుభమే... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook