Google Hyderabad Campus: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్.. కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన

Google Hyderabad Campus: హైదరాబాద్‌లో గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఈ క్యాంపస్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 11:35 AM IST
  • హైదరాబాద్‌లో గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్
  • అమెరికా తర్వాత హైదరాబాద్ క్యాంపసే అతిపెద్దది
  • మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గూగుల్ క్యాంపస్‌కు శంకుస్థాపన
Google Hyderabad Campus: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్.. కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన

Google Hyderabad Campus: పెట్టుబడులకు, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్ కేరాఫ్‌గా మారుతోంది. ఇప్పటికే పలు దిగ్గజ టెక్ సంస్థలు కొలువుదీరిన నగరంలో 'గూగుల్' సంస్థ రూపంలో మరో భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌ను ఆ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించనుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గురువారం (ఏప్రిల్ 28) ఈ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 

గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్‌తో హైదరాబాద్ సిగన మరో మణిహారం చేరినట్లయింది. 7.3 ఎకరాల్లో 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ క్యాంపస్ నిర్మాణం పూర్తి కానుంది. క్యాంపస్ శంకుస్థాపన సందర్భంగా... దానికి సంబంధించిన డిజైన్‌ను గూగుల్ ప్రతినిధులు విడుదల చేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో పలు అంశాల్లో గూగుల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం యువతకు గూగుల్ సాంకేతిక శిక్షణ అందించనుంది. అలాగే, పౌర సేవలు, విద్య, ఇతర రంగాల్లో ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక సాయం అందిస్తుంది.

సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ :

హైద‌రాబాద్‌లో గూగుల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్యాంపస్ నిర్మాణంతో హైదరాబాద్‌లో గూగుల్ త‌మ మూలాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. గూగుల్ సంస్థ 2017 నుంచి తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తోంద‌ని... గతంలో కుదుర్చుకున్న ఎంవోయూలు గొప్ప కార్య‌క్ర‌మాల‌కు బాటలు వేశాయని అన్నారు. 

గూగుల్‌తో కుదుర్చుకున్న తాజా ఒప్పందంతో యువ‌త‌, మ‌హిళ‌లు, విద్యార్థులు, పౌర‌సేవ‌ల్లో మార్పు తీసుకురావ‌డంపై దృష్టి సారిస్తామన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ప్రతీ పౌరుడు డిజిటల్ సాధికారత సాధించేలా శిక్షణ ఇవ్వడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అందిస్తున్నామని గుర్తుచేశారు.
 

Also Read: Saturn Transit 2022: నేడు కుంభరాశిలోకి శని.. ఏ రాశుల వారికి మంచిది... ఏ రాశుల వారికి చెడు జరుగుతుంది

Also Read: Acharya Live Updates: ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'ఆచార్య'... సినిమాపై లైవ్ అప్‌డేట్స్...

 

Also Read: Acharya Live Updates: ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'ఆచార్య'... సినిమాపై లైవ్ అప్‌డేట్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News