Minister KTR Speech at Telangana Bhavan: డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను గన్ పార్కు దగ్గరకు రమ్మని సవాల్ చేస్తున్నారని.. నవ్వాలా సావాలా అర్ధం కావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అమర వీరులుగా మార్చిన వారే అమరవీరుల స్థూపం దగ్గరకు  రమ్మంటారని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతోందని.. తెలంగాణ ఉద్యమ కారులు ఏ పార్టీలో ఉన్నా తెగువ ప్రదర్శించాలని కోరారు. మోదీ,  రేవంత్ రెడ్డి  తెలంగాణ  అస్తిత్వం  మీద దాడి చేస్తున్నారని.. తెలంగాణలో ఏం తక్కువ జరిగిందని  కేసీఆర్ మీద దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. సోనియా దయ దలచి  తెలంగాణ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్  కాదని.. తెలంగాణకు ఏ టీమ్.. అవ్వల్ దర్జా టీమ్ అని స్పష్టం చేశారు. జిట్టా బాలకృష్ణా రెడ్డికి పునరాగమన శుభాకాంక్షలు అని.. దారి తప్పిన కొడుకు తిరిగి ఇంటికి చేరుకున్నట్లు  ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఉద్యమ కారుల మందరం కలిసి  కష్టపడి తెచ్చిన తెలంగాణను కాపాడుకుందాం.. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే మనకు ఇవాళ నీతులు చెబుతున్నారు. రేవంత్  ఆనాడు సోనియాను బలి దేవత అన్నాడు. ఇపుడు కాళీ దేవత అంటున్నాడు. రేవంత్  ఆనాడు రాహుల్‌ను ముద్ద పప్పు అన్నాడు. ఈనాడు నిప్పు అంటున్నాడు. రేవంత్ మారినప్పుడల్లా మనం  మారాలా..? బీసీల జనగణనపై  రాహుల్  ఇప్పుడు  మాట్లాడుతున్నారు. తొమ్మిది  నెలల క్రితం మేము బీసీ జన గణన చేయాలని  మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. రాహుల్‌కు ఇపుడు బీసీ గణన గుర్తుకొచ్చింది. 


కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ గణన ఎందుకు చేయలేదు. కేసీఆర్‌ను దించాలని కొందరు  అంటున్నారు. కేసీఆర్‌ను ఎందుకు దించాలి.  13 లక్షల మందికి పెళ్లిళ్లు చేసినందుకు దించాలా..? ధాన్యం రికార్డు స్థాయిలో పండించినందుకు కేసీఆర్‌ను దించాలా..? తలసరి ఆదాయం పెంచినందుకు కేసీఆర్‌ను దించాలా..? కుల వృత్తులను  కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలకు  కేసీఆర్‌ను దించాలా..? కేసీఆర్ ఏం తక్కువ చేశారని దించాలి.." అని మంత్రి కేటీఆర్ అన్నారు.


ఇందిరమ్మ రాజ్యం  తెస్తామంటున్నారని.. ఎమర్జెన్సీ రోజులు తెస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. మోడీని బీజేపీ వాళ్ళు దేవుడు  అంటున్నారని.. సిలిండర్ ధర పెంచినందుకు మోడీ దేవుడా.. అని నిలదీశారు. రాహుల్‌, మోడీలకు కేసీఆర్ కొరకరాని  కొయ్య అని.. అందుకే  కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం  చేయాలని వాళ్లిద్దరూ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.  తెలంగాణను ఆగం చేయాలనే  వారి కుట్రను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే 40 రోజులు  చాలా కీలకం అని.. అంతటా చర్చ పెట్టాలని కోరారు. 


Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.