municipal dept: హైదరాబాద్:  తెలంగాణ ( Telangana ) లోని మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీపై పురపాలక శాఖ సన్నాహాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.  ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్.. మున్సిపల్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. Also read: Telangana: ఆ ఆసుపత్రుల సంగతేంటి: హైకోర్టు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆయా మునిసిపాలిటీల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మార్పే లక్ష్యంగా నూతన ప్రణాళికలు ఉండాలని మంత్రి పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్, ఇన్ ఫ్రా విభాగాలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. Also read: Telangana: డా. శ్రీరామ్‌ను అభినందించిన ఉపరాష్ట్రపతి


నూతన మున్సిపల్ చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ప్రస్తుత సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత అవసరాల మేరకు నియామకాలను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
Also read: COVID-19: ఆస్పత్రి నుంచి తప్పించుకున్న కరోనా పేషెంట్