KTR About Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ప్రకటన కేవలం దృష్టి మరలించే చర్యనే అని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర సహాయ మంత్రి ప్రకటన గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అదానికి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బిఆర్ఎస్ పార్టీ బయటపెట్టినందున, దాని నుంచి దృష్టిని మరలించేందుకు కేంద్రం స్పందిస్తూ చేసిన ప్రకటనగానే మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి అని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను కేంద్రం పూర్తిగా ఆపేదాకా.. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేదాకా కేంద్రం పైన ఒత్తిడి కొనసాగుతుంది అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో పాటు.. తెలంగాణ ప్రజల హక్కు అయిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గొడ్డలిపెట్టుగా మారిన  అదానీ బైలడిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కుట్రపూరిత వైఖరిని తాము బయట పెట్టిన నేపథ్యంలోనే కేంద్రం ఈ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు.


ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా.. కేంద్రం కుట్రలు చేసిన తీరుపైన భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుందన్నారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy Press Meet: మంత్రి కేటీఆర్ అవినీతికి సాక్ష్యాలివిగో అంటున్న రేవంత్ రెడ్డి


ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధిని చాటుకుంటూ.. మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో పాల్గొంటామని చేసిన ఒక్క ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం వెనక్కి తగ్గిందని కేటీఆర్ అన్నారు. కేసిఆర్ ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ అన్నారు. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకునే దాకా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే దాకా కేంద్ర ప్రభుత్వం పైన నిరంతరం ఒత్తిడి పెంచుతూనే ఉంటామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్రానికి తేల్చిచెప్పారు.


ఇది కూడా చదవండి : Minister Harish Rao: ఏపీలో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయి.. వైసీపీ, టీడీపీలకు మంత్రి హరీష్‌ రావు చురకలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK