Minister KTR Emotional Speech: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమోషనల్ సీన్లు కనిపిస్తున్నాయి. సిద్దిపేట ప్రజలకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువేనంటూ మంత్రి హరీష్ రావు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఎమోషనల్ అయ్యారు. తాను ముఖ్యమంత్రి కుమారుడిని అయినా.. సిరిసిల్ల జిల్లా ప్రజల ఆశీర్వాదం వల్లే ఇక్కడ కూర్చునే అవకాశం వచ్చిందన్నారు. ఏమిచ్చినా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తనకు తల్లి జన్మనిస్తే.. సిరిసిల్ల, ముస్తాబాద్ ప్రజలు రాజకీయ జన్మనిచ్చారంటూ భావోద్వేగానికి గురయ్యారు. తానంటే పరిచయం లేకున్నా వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు కేటీఆర్. దేశంలో బీఆర్ఎస్ కంటే గొప్పగా ఎక్కడ పాలిస్తున్నారంటే సమాధానం లేదన్నారు. తెలంగాణ ఏర్పడకముందు మంచి నీళ్లు, కరెంటుకు ఎంత గోస ఉండేదో మరిచిపోయారా..? అని అడిగారు. తాను ఇటీవల 11 గ్రామాల్లో తిరిగి మంచి నీళ్ల సమస్య ఉందా..? అని ప్రతి ఒక్కరినీ అడిగానని.. ఒక్కరూ సమస్య ఉందని చెప్పలేదని అన్నారు. కరెంట్, నీళ్లు ఇవ్వడం ఈజీ అయితే.. ఇంతకు ముందు పాలించిన వాళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఇక్కడి ఉన్న ఎంపీ ప్రధాని మోదీని దేవుడు అంటారని.. ఆయన ఎవరికి దేవుడని నిలదీశారు. అదానీకి మోదీ దేవుడని.. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇంతకుమించి మోదీ ఏం చేశారంటే సమాధానం చెప్పే దమ్ముందా..? అని సవాల్ విసిరారు. ప్రజలు అడకపోయినా.. 4 లక్షల మందికి బీడీ పింఛన్లు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని ఆందోళన చెందవద్దని.. గృహ లక్ష్మి పథకం కింద తప్పకుండా ఇల్లు కట్టుకునేందుకు లోన్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుటుంబ పాలన అని కొంతమంది అంటున్నారని.. తమది 4 కోట్ల ప్రజల కుటుంబ పాలన అని పరోక్షంగా మోదీపై విమర్శలు చేశారు. 60 లక్షల బలగమే కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ వచ్చి గల్లీ గల్లీ తిరిగినా ఏమీ చేయలేరని సెటైర్లు వేశారు.
Also Read: Interstate Gang: వాట్ ఏ ప్లానింగ్.. జులాయి మూవీ సీన్ రిపీట్.. తీగ లాగితే డొంకంతా బయటపడింది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి