KTR Tests Positive For COVID-19: దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ బారిన పడుతున్నారు. ఇదివరకే పలువురు కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. కొందరు చికిత్స అనంతరం కోలుకుని యథావిథిగా సేవలు అందిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా సోకగా, తాజాగా ఆయన తనయుడు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు కరోనా పాజిటివ్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించగా ఆయనకు కోవిడ్19 పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు. ‘నాకు కరోనా పాజిటివ్. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా నన్ను కలుసుకున్న వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. కోవిడ్ నిబంధనలు పాటించి, జాగ్రత్తగా ఉండాలని’ మంత్రి కేటీఆర్(KTR COVID-19 Positive) తన ట్వీట్ ద్వారా సూచించారు.


Also Read: Travel Ban: కోవిడ్19 కల్లోలం, భారత్‌పై ట్రావెన్ బ్యాన్ విధించిన మరో రెండు దేశాలు



కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌ వచ్చి యశోదా ఆసుపత్రిలో ఆరు రకాల పరీక్షలు సీఎం కేసీఆర్(Telangana CM KCR) చేయించుకున్నారు. ఆయనకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ లేదని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకిందన్న వార్త తెలియగానే టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఆందోళనకు గురయ్యారు. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానని, కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లానని మంత్రి కేటీఆర్ తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook