Travel Ban To India | దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. భారత్‌లో కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్ నుంచి ప్రయాణాలను కొన్ని రోజులపాటు రద్దు చేస్తూ ఆంక్షలు విధించారు. ఒక్క రోజులో 3 లక్షలకు పైగా కరోనా కేసులతో 24 గంటల వ్యవధిలో అత్యధిక కోవిడ్19 కేసులు నమోదు చేసిన ఏకైక దేశంగా భారత్ తయారైంది.
యూఏఈ ప్రభుత్వం 10 రోజులపాటు భారత్ నుంచి ప్రయాణాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి (ఏప్రిల్ 24న) 11;59 నిమిషాల నుంచి పది రోజులపాటు ప్రయాణాలపై ఆంక్షలు విధించారని గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ చేసింది. గత 14 రోజుల నుంచి భారత్ నుంచి యూఏఈకి వెళ్లిన వారిని తిరుగుత ప్రయాణాలకు అనుమతించరని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే డిప్లామేటిక్ పాస్‌పోర్ట్ కలిగిన వారు, యూఏఈ సిటిజన్స్, అధికారిక సమావేశాల కోసం వచ్చిన వారిపై ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.
Also Read: Covisheild Vaccine Price: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
కెనడా సైతం ఆంక్షలు
భారత్‌లో గురువారం ఒక్కరోజు 3,14,835 కరోనా కేసులు నమోదు కావడంతో కెనడా సైతం భారత్ నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. భారత్ నుంచి 30 రోజులపాటు ప్రయాణాలు నిషేధిస్తూ కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఈ నిషేధం అమలులోకి రానుందని రవాణాశాఖ మంత్రి ఒమర్ అల్ఘాబ్రా తెలిపారు. భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెనడా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, భారత్ నుంచి ప్రయాణాలపై ఇదివరకే కొన్ని దేశాలు తాత్కాలిక నిషేధం విధించగా, తాజాగా ఆ దేశాల జాబితాలో యూఏఈ, కెనడా చేరాయి. యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్ సహా పలు దేశాలు భారత్ దేశానికి ప్రయాణాలు చేయవద్దని, అక్కడి నుంచి తమ దేశంలోకి ఎవరికీ అనుమతించకుండా ట్రావెన్ బ్యాన్ విధించాయి. అమెరికా సైతం భారత్‌కు అత్యంత అవసరమైన సమయంలోనే ప్రయాణించాలని, లేనిపక్షంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని తమ దేశ పౌరులను హెచ్చరించింది.
Also Read: Flights Cancel: యూకే ఆంక్షలు, వారం రోజులపాటు Air India సర్వీసులు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook