Teenmar Mallanna about ktr: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోతారన్న తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna about ktr: ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారని చెప్పుకొచ్చిన తీన్మార్ మల్లన్న.. ఓడిపోయే వారిలో మంత్రి కేటీఆర్ కూడా ఉంటారని అన్నారు.
Teenmar Mallanna about ktr: మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో ఓడిపోతారు అని తీన్మార్ మల్లన్న అన్నారు. సిరిసిల్లలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. ఆ వ్యతిరేకతే మంత్రి కేటీఆర్‌ని ఓడిస్తుందని తీన్మార్ మల్లన్న అభిప్రాయపడ్డారు. జీ న్యూస్ తెలుగులో తాజాగా జరిగిన బిగ్ డిబేట్ విత్ భరత్ స్పెషల్ లైవ్ షోలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న.. అనేక ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగానే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురించి మాట్లాడుతూ.. సిరిసిల్ల ఓటర్లు మంత్రి కేటీఆర్‌ని ఓడించడం ఖాయం అని జోస్యం చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారని చెప్పుకొచ్చిన తీన్మార్ మల్లన్న.. ఓడిపోయే వారిలో మంత్రి కేటీఆర్ కూడా ఉంటారని అన్నారు. క్రితంసారి ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌కి భారీ మెజార్టీ వచ్చినప్పటికీ.. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా వచ్చిందన్నారు. మంత్రి కేటీఆర్ తనకున్న పరపతితో అధిక మొత్తంలో నిధులు సిరిసిల్ల నియోజకవర్గానికి తీసుకువెళ్లినప్పటికీ... స్థానికులు మాత్రం ప్రభుత్వంపై, మంత్రి కేటీఆర్‌పై వ్యతిరేకతతోనే ఉన్నారని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) చెప్పుకొచ్చారు. ప్రజలపై టీఆర్ఎస్ నాయకుల దాడులు, దోపీడీలు అధికమయ్యాయని.. అందుకే జనం అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్నారని వివరించారు.
Also read : Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook