Sircilla Mega Powerloom Cluster : సిరిసిల్లలో (Sircilla) మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్‌) కింద సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని కోరారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అవసరమైన వనరులు, నిపుణులైన కార్మికులు సిరిసిల్లలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌కు కేటీఆర్ (KTR) లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకై గతంలో ఏడుసార్లు కేంద్రానికి లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని గుర్తుచేశారు. వ్యక్తిగతంగా సమావేశమైన సందర్భంలోనూ ఈ విషయమై గుర్తు చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు (Handloom workers) రాయితీలతో పాటు ఆ రంగానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని గుర్తుచేశారు. 40శాతం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్‌ ఫండ్‌ తదితర పథకాలతో చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు నిరంతరం పని అందించడం ద్వారా వారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.


Also Read: Assam Rifles: భార్యతో ఆ జవాన్ చివరి ఫోన్ కాల్.. దాడికి కొద్ది గంటల ముందు ఏం చెప్పాడంటే


కేంద్రం ప్రకటిస్తున్న పథకాలన్నీ ఎలాంటి వనరులు లేని రాష్ట్రాలకు మళ్లుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ లాంటి అభివృద్ది పథంలో నడుస్తున్న రాష్ట్రానికి కేంద్రం ఆదరణ కల్పించకపోవడంతో మన దేశం చిన్న దేశాలతో కూడా పోటీ పడలేకపోతోందన్నారు. గతంలో వివిధ సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను కేంద్రం ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగంలో పలు పెట్టుబడులను ఆకర్షించగలిగిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల (Job Opportunities) కోసం తెలంగాణ యువత ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా మెగా పవర్‌లూం క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe