Minister Malla Reddy Liquor Party: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముక్క, చుక్క లేనిదే ఇక్కడ ఎన్నికల ప్రచారం జరగడం లేదనేది బహిరంగ రహస్యం. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని మునుగోడు ప్రజలే చెప్పుకుంటున్న తీరు అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే, రూలింగ్ పార్టీకి చెందిన మంత్రులు, ఇతర కీలక నేతలపై మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తీరాలనే ఒత్తిడి ప్రభావం ఇంకాస్త ఎక్కువే కనిపిస్తోంది. దీంతో తమకు అప్పగించిన గ్రామాల ఇంచార్జ్ బాద్యతలను నిర్వర్తించడానికి స్వయంగా మంత్రులే రంగంలోకి దిగి ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గెలుపే పరమావధిగా జరుగుతున్న మునుగోడు ప్రజా సంగ్రామంలో విలువలకు తిలోదకాలిచ్చి ఓటర్లను మచ్చిక చేసుకోడానికి స్వయంగా మంత్రి మల్లారెడ్డి మందు బాటిల్ చేతపట్టుకుని మరీ డ్రింక్ సర్వ్ చేస్తుండగా తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, రెడ్డి బావి, గుండ్ల బావి గ్రామాల్లో టీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి... ఇదిగో ఇలా తనతో కలిసి టేబుల్‌ షేర్ చేసుకుంటున్న వారికి మందు వంచుతున్నఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యాయి. 


మంత్రి మల్లారెడ్డి ఇలా మందు పార్టీ ఇస్తుండటం చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడీ కర్మ వచ్చి ఉండేది కాదు కదా అని కొందరు విమర్శిస్తే.. కేవలం హామీలు ఇచ్చినంత మాత్రాన్నే ఓట్లు రాలవు అని మంత్రి మల్లారెడ్డికి సీన్ అర్థమై పోయినట్టుంది.. అందుకే చేసేదేమీ లేక స్వయంగానే ఆయనే ఇలా మందు బాటిల్ పట్టుకుని రంగంలోకి దిగినట్టున్నారు అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ కేబినెట్‌లో ఈ విధంగా సోషల్ మీడియాలో పాపులర్ అవడం ఒక్క మంత్రి మల్లారెడ్డికే చెల్లిందంటున్నారు ఇంకొంత మంది నెటిజెన్స్.


Also Read : Gadder Munugode Contest: గద్దర్ పోటీతో గండం ఎవరికి? మునుగోడు ఉపసమరంలో కోవర్టులున్నారా?


Also Read : Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్..


Also Read : Munugode Bypoll: 200 బ్రిజాకార్లు.. 2 వేల బైకులు బుకింగ్! మునుగోడు లీడర్లకు పండుగే పండుగ


Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలో బిగ్ ట్విస్ట్.. టీడీపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి