Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్..

Komatireddy Venkat Reddy: సీనియర్ నేత, స్థానిక ఎంపీ కోమటిరెడ్జి వెంకట్ రెడ్డి విషయంలో గందరగోళం నెలకొంది.తన సోదరుడిని గెలిపించుకునేందుకు లోపాయకారిగా వెంకట్ రెడ్డి.. బీజేపీకి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Oct 9, 2022, 03:00 PM IST
  • కాంగ్రెస్ లో కోమటిరెడ్డి కాక
  • వెంకట్ రెడ్డి బీజేపీకి వెళతారనే ప్రచారం
  • క్లారిటీ ఇచ్చిన పీసీసీ లీడర్లు
Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్..

Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. తమ సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా వచ్చే మూడు వారాలు మునుగోడులోనే ఉండనున్నారు. అయితే కాంగ్రెస్ కు సంబంధించి సీనియర్ నేత, స్థానిక ఎంపీ కోమటిరెడ్జి వెంకట్ రెడ్డి విషయంలో గందరగోళం నెలకొంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. దీంతో తన సోదరుడిని గెలిపించుకునేందుకు లోపాయకారిగా వెంకట్ రెడ్డి.. బీజేపీకి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొందరు కాంగ్రెస్ స్థానిక లీడర్లు డిమాండ్ చేశారు. సోదరుడి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరుతారనే టాక్ కూడా వస్తోంది.

టీపీసీసీ నేతలు మాత్రం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని.. మునుగోడులో ప్రచాపం చేస్తారని చెబుతూ వస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కార్యాచరణపై హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు.ఏఐసీసీ సెక్రటరీ లతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ,ఉత్తంకుమార్ రెడ్డి,రాంరెడ్డి దామోదర్ రెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మునుగోడు ప్రచారంతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపైనా చర్చించారని తెలుస్తోంది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పీసీసీ పెద్దలు.. వెంకట్ రెడ్డి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 14వ తేదీ వరకు పార్టీ నేతలంతా  మునుగోడు ప్రచారంలోనే ఉంటారని చెప్పారు పీసీసీ చీఫ్ రేంవత్ రెడ్డి.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో ఏఐసీసీ నేతలు మాట్లాడుతున్నారు..కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తెలిపారు. బీజేపీ ,టిఆర్ఎస్ మధ్య మిత్ర భేదమే తప్ప శత్రు బేధం లేదన్నారు. వాటాల పంపకాల్లోనే గులాబీ, కాషాయ పార్టీల మధ్య పంచాయతీ నడుస్తోందన్నారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం పాత్రలతో  టిఆర్ఎస్ , బీజేపీలను పోల్చారు రేవంత్ రెడ్డి. గులాబీ వసూళ్ల పై సెంట్రల్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు.

మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నవంబర్ 6న అద్బుతమైన రిజల్ట్స్ చూస్తారని చెప్పారు.  కాంగ్రెస్ ఎంపీలపై మంత్రి కేటీఆర్ చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ లో కోవర్టులు ఎవరు లేరన్నారు. ఎంపీ కోమటిరెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.  మునుగోడులో తమ వ్యూహం తమకు ఉందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ముఖ్య నేతలంతా మునుగోడు పై దృష్టి సారించారన్నారు.  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఎలాంటి అనుమానాలు వద్దని.. పార్టీ విజయం కోసం పనిచేస్తారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సస్పెండ్ చేయాలని ఎవరు డిమాండ్ చేసారో తనకు తెలియదన్నారు భట్టి విక్రమార్క.

Also Read : Munugode Bypoll: 200 బ్రిజాకార్లు.. 2 వేల బైకులు బుకింగ్! మునుగోడు లీడర్లకు పండుగే పండుగ

Also Read : కొత్త కారుకు గొప్ప వెల్‌కమ్.. ఎంట్రీ అదిరిపోయిందిగా! వీడియో చూస్తే నవ్వుకుంటారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News