Munugode Bypoll: బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. మునుగోడులో బీజేపీ అడ్డదారిలో గెలవాలని చూస్తోందని..కోట్లు పెట్టి ప్రజలను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి దొడ్డిదారిన గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. నాయకులను డబ్బులు పెట్టి కొనడమే కాదు..కార్లు మోటర్ సైకిళ్ళు గిఫ్ట్ గా ఇస్తున్నారని అన్నారు. మునుగోడులో పంచడానికి కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు 200 బ్రిజా కార్లు, 2 వేల మోటార్ బైకులు బుక్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు హరీష్ రావు. మండల్ వైజ్ గా కొత్తగా వచ్చిన కార్లు, బైక్స్ లిస్ట్ ఎన్నికల కమిషన్ కు ఇస్తామన్నారు.
ఇప్పుడు మోటార్ బైకులు ఇస్తారు.. గెలిచాకా మోటార్లకు మీటర్లు పెడతారని హరీష్ రావు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి గతంలో అన్నాడని గుర్తు చేశారు.మోటార్లు కావాలా మోటార్ బైకులు కావాలా మునుగోడు ప్రజలే తేల్చుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డే అంగీకిరంచారని హరీష్ రావు అన్నారు. గత 8 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిందేమి లేదన్నారు. తాము చేసిన మంచి పనులేంటో చెప్పి ఓట్లు అడగాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తే.. పేద ప్రజలక కడుపు నింపిన నాయకుడిగా కేసీఆర్ నిలిచారన్నారు. ఎన్నిగల్లో గెలిస్తే ఏం చేస్తారో బీజేపీ చెప్పాలన్నారు.మునుగోడు ప్రజలు గెలవాలా? రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలా? చూడాల్సి ఉందన్నారు. మునుగోడు ఓటర్ల చైతన్యవంతులని.. విమానాలు కొనిచ్చినా అభివృద్ధికే పట్టం కడతారనే నమ్మకం ఉందన్నారు.
బండి సంజయ్ దిగజారిపోయారని.. క్షుజ్రపూజలు చేస్తున్నాపని అసత్య ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత వైద్యం కోర్సును యూపీలోని బెనారస్ యూనివర్శిటీలో ప్రవేశపెట్టారని చెప్పారు. బీజేపీ నేతలకే నిమ్మకాయల గురించి బాగా తెలుసన్నారు హరీష్ రావు, ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడి తెలంగాణ సాధించాం.. మతఘర్షణలు, మతకల్లోలాలు,చేతబడులు, బూత వైద్యం కోర్సులు మాకు తెలియవు.. బీజేపీ నేతలక బూత వైద్యం గురించి బాగా తెలుసు.. అందుకే బండి సంయ్ మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ యూపీకి వెళ్లి యోగీ సర్కార్ ప్రవేశపెట్టిన బూత వైద్యం కోర్టు చేస్తే బెటర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు. మంత్రతంత్రాలతో మేమేమైనా అధికారంలోకి వచ్చామా?.. మతం పేరుతో అధికారంలోకి వచ్చే రాజకీయం బీజేపీది అన్నారు. టీఆరెస్ దగ్గర తాంత్రిక విద్యలు లేవు.. కేవలం లోక్తాంత్రిక్ మాత్రమే ఉందన్నారు హరీష్ రావు.
Also Read : కొత్త కారుకు గొప్ప వెల్‌కమ్.. ఎంట్రీ అదిరిపోయిందిగా! వీడియో చూస్తే నవ్వుకుంటారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి