తెలంగాణలో విద్యా సంస్థలకు అకాడమిక్ సంవత్సరం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు 53.79 లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 26న ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 31 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులుగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం సెలవుల వివరాలు ఆమె ప్రకటించారు. కరోనా(CoronaVirus) సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయడం తెలిసిందే. 5,21,392 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితులు కనిపించని నేపథ్యంలో వారందరినీ పాస్ చేయడం తెలిసిందే. అయితే జూన్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తారా లేదా అనే దానిపై మే చివరి వారంలో నిర్ణయం తీసుకోనున్నారు. 


Also Read: Covid-19 Positive Cases: Telanganaలో భారీగా నమోదైన కరోనా కేసులు, మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,126 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232కి చేరింది. కోవిడ్19(Covid-19) బారిన పడి మరో 38 మంది మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు సైతం టీకాలు తీసుకోనున్నారు.


Also Read: New Covid Vaccine: ఇండియాలో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్, మూడవ దశ పరీక్షలకు అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook