Covid-19 Positive Cases: Telanganaలో భారీగా నమోదైన కరోనా కేసులు, మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు

Covid-19 Positive Cases In Telangana | తెలంగాణలోనూ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 38 మంది మంది మరణించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 25, 2021, 12:12 PM IST
  • తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,126 మంది కరోనా బారిన పడ్డారు
  • నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232కి చేరింది
  • కోవిడ్19 బారిన పడి మరో 38 మంది మంది మరణించారు.
Covid-19 Positive Cases: Telanganaలో భారీగా నమోదైన కరోనా కేసులు, మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు

Covid-19 Positive Cases In Telangana : కరోనా వైరస్ రెండో దశలో పలు దేశాలు భారీ ప్రాణ నష్టాన్ని చవిచూస్తున్నాయి. పలు దేశాలు భారతదేశం నుంచి ప్రయాణికులను అనుమతించడం లేదు. తెలంగాణలోనూ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 8,126 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,08,602 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 8 వేల నూట ఇరవై ఆరు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా(COVID-19) పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 95 వేల 2 వందల ముప్పై రెండుకు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 38 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,999కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా 24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.

Also Read: COVAXIN Vaccine Price: కోవాగ్జిన్ టీకా ధరలు ప్రకటించిన భారత్ బయోటెక్

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 3,307 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,30,304 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కరోనా టీకాలు(Corona Vaccine) ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో జీహెచ్ఎంసీలో అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులలో GHMC పరిధిలో 1,259 కరోనా కేసులు నిర్ధారించడం గమనార్హం. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతూ జరిమానాకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 62 వేల 929 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,24,93,399 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

Also Read: COVID-19 Positive Children: కరోనా సోకిన చిన్నారులను ఎలా చూసుకోవాలి, కేర్ టేకర్స్ ఏమేం పాటించాలంటే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News